మెగాస్టార్ చిరంజీవి ఏ పనిచేసినా ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో చేస్తాడు అనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం చిరంజీవి లండన్ లో ఏమి చేస్తున్నాడు అంటూ చాలామందిలో సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి గత కొద్ది రోజులుగా లండన్ లో చాల బిజీగా ఉన్నాడు అని టాక్. 

అయితే ప్రస్తుతం చిరంజీవి లండన్ ట్రిప్ వెనుక తన 150 వ సినిమా ఫిట్నెస్ ప్లాన్ ఉందా అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తన లుక్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న చిరంజీవి లండన్ లోని ఫిట్నెస్ ఎక్స్ పర్ట్స్ నుండి తన లుక్ గురించి కొన్ని సలహాలు తీసుకుంటున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

అంతేకాదు తనయుడు చెర్రీ ట్రూ జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారాల కోసం చిరంజీవి లండన్ వెళ్ళాడు అనే ప్రచారం కూడ ఉంది. మరి కొందరైతే మండిపోతున్న ఈ ఎండలను తట్టుకోలేక చిరంజీవి రెస్ట్ కోసం లండన్ వెళ్ళాడు అని కూడా అంటున్నారు. 

ఏది ఎలా చూసుకున్నా ఎదో ఒక రాచకార్యం నిమిత్తమే ప్రస్తుతం చిరంజీవి లండన్ లో విహరిస్తున్నాడు అనుకోవాలి. ఈ నెలాఖరుకు చిరంజీవి భాగ్యనగరం తిరిగి వస్తాడు అని టాక్. ఆ తరువాత కాని ఈ వార్తాల పై ఒక క్లారిటీ రాదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: