బాలీవుడ్ హీరోయిన్స్ డేటింగ్ సెక్స్ విషయాల పై చాల ముక్కుసూటిగా మాట్లాడుతారు అన్న విషయం తెలిసిందే. మీడియా మాట్లడేడప్పుడు కూడా ఎటువంటి మొహమాటానికి లోను కాకుండా తమ అభిప్రాయాలను ఈ విషయాల పై వెల్లడిస్తూ అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కృతి సనన్ డేటింగ్ పై చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి

 ‘డేటింగా అదంటే ఏంటీ? అని అమాయకంగా అడగను ఎందుకంటే ఒకప్పుడు నేను డేటింగ్ చేశా’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది కృతిసనన్.  అంతేకాదు తనకు  అప్పుడు కావాల్సినంత తీరిక ఉండేది అని అంటూ  ఇప్పుడు డేటింగ్ చేద్దామన్నా కుదరడంలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ప్రస్తుతం తనకు  షూటింగ్స్‌తోనే సరిపోతోంది కాబట్టి ఎవరినీ ప్రేమించడం లేదని ఒకవేళ ఎవరితో అయినా ప్రేమలో పడ్డా  అది ఎంతోకాలం కొనసాగదు అని అంటోంది. దీనికి కారణం ప్రేమలో పడితే ఆవ్యక్తితో  ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి కదా అంటూ వింత వ్యాఖ్యలు చేస్తోంది కృతి.

తన ఆనందం గురించి కాకుండా తనను ప్రేమించే వాడి ఆనందం గురించి ఆలోచించాలని ఈరోజు హైదరాబాద్‌లో రేపు ముంబయ్‌లో ఆ తర్వాత విదేశాల్లో ఇలా ఊళ్లు పట్టుకు తిరిగే తనకు ప్రేమ వ్యవహారాలు సరిపోవని ఒక ముంబాయి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటైన కామెంట్స్ చేసింది కృతి సనన్. షూటింగ్ లు మానుకుంటే తన ఉద్యోగం మానుకున్నట్లే అని అంటూ నిర్మాతలను తమ సినిమాల షూటింగ్ ముంబాయిలోనే పెట్టుకోండి అంటే ఒప్పుకోరు కాబట్టి తాను ప్రస్తుతానికి ఎవర్ని ప్రేమించడంలేదని అయితే తాను గతంలో డేటింగ్ చేసిన విషయం మాత్రం వాస్తవం అంటూ కృతి చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: