దర్శక రత్న దాసరి నారాయణ రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్లో సినిమా వస్తుందని గతంలో సోషల్ నెట్ వర్క్ లో వార్తలు గుప్పుమన్నాయి.   దానికి కార్యరూపం దాల్చబోతున్నట్టు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కల్కి' అనే టైటిల్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతం పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ 2 చిత్రం ఈ నెలాఖరున ప్రారంభం కానున్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే దాసరి చిత్రంలో నటించబోతున్నన్నట్లు తెలుస్తుంది. 


దాసరి నారాయణరావు, పవన్ కళ్యాన్

ఈ సినిమా అక్టోబర్ లో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు దాసరి నారాయణ రావు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తారకప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 37వ చిత్రాన్ని పవన్  తీస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు దర్శకుడిగా గోపాల గోపాల చిత్రం డైరక్ట్ చేసిన కిషోర్ పార్దసారధి(డాలి) అని తెలుస్తోంది. ఈ మేరకు డాలి స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంయుక్తంగా సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: