‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ ప్రభాస్ అభిమానులలో కలవరపాటు పెరిగి పోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో జరగబోతున్న ఈ ఆడియో వేడుకకు చిరంజీవి రజినీకాంత్ అక్షయ్ కుమార్ లు అతిధులుగా రాబోతున్నారు. వీరితో పాటు ఆల్లు అర్జున్ వెంకటేష్ నాగార్జున్ లు కూడ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు అని టాక్.

అత్యంత భారీ ఖర్చుతో భారీ సినిమా తారల మధ్య ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ఆడియో ఫంక్షన్ కు ఇంతమంది సూపర్ స్టార్స్ రావడం భయ పెడుతోంది అని టాక్. ఇప్పటికే ‘బాహుబలి’ పేరు చేపితే రాజమౌళి ప్రస్తావన వచ్చిన తరువాత మాత్రమే ఆ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ప్రస్తావన వస్తున్న నేపధ్యంలో ఈ ఆడియో ఫంక్షన్ లో కూడా ఇంతమంది టాప్ హీరోల మధ్య ప్రభాస్ కు సరైన ప్రాముఖ్యత లభిస్తుందా? అనే సందేహాలు ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి అన్న వార్తలు వినపడుతున్నాయి.

సామాన్యంగా భారీ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో ఆ సినిమాలో నటిస్తున్న హీరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడు. కాని ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ కు ప్రధాన ఆకర్షణగా ఆ కార్యక్రమానికి వస్తున్న టాప్ హీరోలు ఆరోజు కార్యక్రమానికి సెలిబ్రెటీలుగా మారిపోతే ప్రభాస్ ప్రాముఖ్యత తగ్గి పోతుందేమో అని ప్రభాస్ వీరాభిమానుల భయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తెలుస్తున్న లేటెస్ట్  సమాచారం మేరకు రాజమౌళి ఈ ఆడియో వేడుకను ఎటువంటి టాప్ హీరోలను అతిధులుగా పిలవకుండా నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ కొన్ని చిన్న సినిమాల ప్రచారానికి కూడా వేదిక కాబోతోంది అని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని మే 31వ తారీఖున లైవ్ టెలికాస్ట్ చేయబోతున్న టివి5 ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది అని వార్తలు వస్తున్నాయి. 1.5 కోట్ల భారీ మొత్తంతో ఈ ఆడియో వేడుక లైవ్ టెలికాస్ట్ రైట్స్ ను సొంతం చేసుకున్న టివి5 ఆ మొత్తాన్ని రాబట్టుకోవడానికి భారీ స్థాయిలో ప్రకటనలు సేకరిస్తోoది  అని అంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ టెలికాస్టింగ్ మధ్యన చాల ప్రకటనలు ఉండటమే కాకుండా జూన్ నెలలో విడుదల కాబోతున్న చాల చిన్న సినిమాలకు సంబంధించిన యాడ్స్ కూడా ‘బాహుబలి’ లైవ్ టెలికాస్ట్ మధ్యలో ప్రసారం కాబోతు ఉండటం బట్టి ‘బాహుబలి’ హడావిడి చిన్న సినిమాలను  ప్రమోట్ చేయబోతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: