‘శివ’, ‘సత్య’, ‘సర్కార్’ లాంటి సినిమాలను తీసిన  రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తన స్థాయికి సరిపోని సినిమాలు తీస్తున్నా అతడి అభిమానులు సర్దుకు పోతు వస్తున్నారు. అయితే ఇప్పుడు వర్మ చేయబోతున్న లేటెస్ట్ సినిమా వార్తలు అతడి అభిమానులకు కూడా షాకింగ్ మారింది అని వార్తలు వస్తున్నాయి. 

నిరంతర వివాదాల రామ్ గోపాల్ వర్మ ఒక పోర్న్ మూవీని తీయబోతున్నాడని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక సంచలన వార్తను ప్రచురించింది. రామ్ గోపాల్ వర్మ రాబోతున్న సెప్టెంబర్ నుండి అమెరికా లో పోర్న్ స్టార్ టోరి బ్లాక్  తో ఒక అడల్ట్ సినిమాను చేయడానికి వర్మ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడని కధనం. ఇటువంటి సినిమాలు ఇండియాలో తీయకూడదు అనే నిభందన ఉండటంతో వర్మ ఈ సినిమా షూటింగ్ కు అమెరికాను ఎంచుకున్నాడని తెలుస్తోంది. 

అంతేకాదు వర్మకు ఎప్పటినుంచో ఒక పోర్న్ మూవీకి దర్శకత్వం వహించాలి అన్న కోరిక ఉండటంతో ఆకోరికను ఈ సినిమా నిర్మాణం ద్వారా తీర్చు కుంటున్నాడనే వార్తలు కూడ ఉన్నాయి. వర్మ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న వీరప్పన్ జీవితం పై సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. 

ఈమధ్యనే వర్మ ’365 డేస్’ సినిమాను తీసి తాను పూర్తిగా మారిపోయాను అని చెప్పి కొద్ది రోజులు కూడా గడవకుండానే ఏకంగా ఒక అడల్ట్ మూవీకి డైరెక్టర్ గా మారడం బట్టి వర్మ ఎంత అయోమయంలో ఉన్నాడో అర్ధం అవుతుంది. ఎలా ఆలోచించినా ఇది వర్మ స్థాయికి తీసుకో తగ్గ నిర్ణయంకాదు అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: