తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం పెళ్లిభాజాలు బాగానే మోగుతున్నాయి. మొన్న మంచు మనోజ్ పెళ్లి, తర్వాత అల్లరి నరేష్ నిశ్చితార్థం జరిగింది అంతే కాదు ఈ నెల 29 న నరేష్ వివాహం జరగనుంది.  వీరి బాటలోనే ప్రముఖ హాస్య నటుడు తాగుబోతు రమేష్ పెళ్లి భాజా మోగించాడు.  మొత్తానికి తాగుబోతో రమేష్ ఓ ఇంటివాడు అయ్యాడు. తెలంగాణ కామెడియన్ లో ఒకడైన తాగు బోతు రమేష్ తన మ్యానరిజంతో అందరినీ మెప్పించాడు.


తాగుబోతు రమేష్ సతీమణి స్వాతితో...


ఇటీవల నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ రైల్వేస్టేషన్ గ్రామానికి చెందిన చెందిన స్వాతితో రమేష్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే, ఈ రోజు వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు మనోడు ట్విట్ లో పెట్టాడు. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ ద్వారా రమేష్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సన్నిహితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: