తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా విడుదల అయ్యి ప్రజల ముందుకు వచ్చే సంగతి ఏమిటో కాని ఏ సినిమాకు రాని పాజిటీవ్ టాక్.. నెగిటీవ్ టాక్ అన్ని రకాలుగా వార్తల్లో నిలిచిపోతుంది. తాజాగా ఈ 31న ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ, ఈ వేడుక వాయిదా పడింది,  ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి కారణాన్ని వెల్లడించారు.


ప్రెస్ మీట్ సందర్భంగా వచ్చి రాజమౌళి, ప్రభాస్


చాలా కాలం తర్వాత ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు, ప్రెస్ మీట్ కు హాజరైన ప్రభాస్, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగర్డ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ...''ఫ్యాన్స్ అందర్నీ కలిసి రెండేళ్లయ్యింది. సెక్యుర్టీ రీజన్స్ వల్ల బాహుబలి వేడుక చేయలేకపోతున్నాం. తదుపరి తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు'' అని ప్రభాస్ తెలిపాడు. మీ ముందుకు వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుందని మీముందుకు ఎప్పుడు వస్తానా అన్న ఆతృత నాకు కూడా ఉందని కొన్ని అనుకోని అవాంతరాల వల్ల మీముందుకు రాలేక పోతున్నాను అంటూ ప్రేక్షకులకు బాదపడవద్దని కోరారు. ఫ్యాన్స్ ను డిస్పప్పాయింట్ చేసామనే బాధ ఉంది. కానీ వారి క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రేస్ మీట్ సందర్భంగా వేదికపై బాహుబలి టీమ్


బాహుబలి ఆడియోపై ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ల హీరోని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తుంటారు. భీమవరం, ఖమ్మం, వరంగల్, కర్నూలు వంటి కొన్ని ప్రాంతాల్లో మేమే ఆర్గనైజ్ చేస్తాం, మీ టీంతో వచ్చేమని కూడా అభిమానులు చెబుతున్నారంటే అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జరిగినందుకు బాధగానే ఉంది. హిందీలో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ మాత్రమే జరుగుతుంది. హిందీ ట్రైలర్, తెలుగు ట్రైల్ వేర్వేరుగా ఉంటాయి' అని రాజమౌళి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: