యంగ్ హీరో రామ్ హుషారైన పాత్రలకు పెట్టింది పేరు. డాన్స్ లో నటనలో చాల వేగంగా తన మూమెంట్స్ ను పలికిస్తూ కమర్షియల్ హీరోల జాబితాలో రామ్ చేరిపోయినా టాప్ యంగ్ హీరోల లిస్టులో మాత్రం రామ్ స్థానం సంపాధించుకోలేకపోతున్నాడు. దాదాపు 18 నెలల విరామం తరువాత తిరిగి ఈరోజు ‘పండగ చేస్కో’ అంటూ హడావిడి చేస్తూ వస్తున్న రామ్ తన లేటెస్ట్ మూవీ పై చాల నమ్మకం పై ఉన్నాడు.

ఈరోజు విడుదల అవుతున్న తన ‘పండగ చేస్కో’ సినిమా విషయాలను తెలియచేస్తూ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్ళి పై తానే సెటైర్లు వేసుకున్నాడు రామ్. తాను ఈమధ్యనే 27వ సంవత్సరంలోకి అడుగు పెట్టానని అందువల్ల తన పెళ్ళికి ఇంకా వెయిట్ చేయవచ్చు అని అనుకుంటున్నానని అయితే తన సినిమా రిలీజ్ లే తన చేతిలో లేని నేపధ్యంలో తన పెళ్ళి తన చేతిలో ఏముంటుంది అంటూ నవ్వుతూ తన పెళ్ళి పై తానే సెటైర్లు వేసుకున్నాడు రామ్.

ఇన్ని సినిమాలు చేసినా ఏ హీరోయిన్ తో రామ్ ను లింక్ చేస్తూ గాలి వార్తలు రాకపోవడానికి గలా కారణాలను వివరిస్తూ తన తల్లి తండ్రులు అంటే తనకు విపరీతమైన ఇష్టమని వారు తిడతారేమో అని అనుకోకుండా వారు బాధ పడతారేమో అని అనుకుని తాను ఎటువంటి గాసిప్ వార్తలలోను లేకుండా కేవలం తన హీరోయిన్స్ ను స్నేహితులుగానే చూస్తానని అందువల్లనే తన పై ఎటువంటి గాసిప్పులు ఇంతవరకు రాలేదు అని చెపుతున్నాడు రామ్.

ఇక తన ‘పండగ చేస్కో’ ఈ సినిమా కోసం తాను 9కిలోల బరువు తగ్గి అందంగా కనిపించడానికి తన వంతు ప్రయత్నాన్ని తన శక్తిమేరకు చేసానని అంటూ ఈ సినిమా కథ అందరికీ నచ్చే విధంగా తయారు కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక పండగ వాతావరణాన్ని ధియేటర్లలో ఫీల్ అవుతారని అందుకే ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ టైటిల్ పెట్టారని అంటున్నారు. రామ్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ఈ సినిమా విజయం పై ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో మరికొద్ది గంటలాలో తేలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: