ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో అల్లుఅర్జున్. అల్లుఅర్జున్ నటిస్తున్న మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపిస్తుంది. అల్లుఅర్జున్ మూవీ అంటే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. ఇదిలా ఉంటే, ఈ మధ్యే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి సన్నద్ధమవుతున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తొలిసారిగా రాబోతున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. గత కొంతకాలంగా మాస్‌కు దూరంగా కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తున్నారు అల్లు అర్జున్. అదే సమయంలో సింహా లెజెండ్‌లాంటి భారీ మాస్ కమర్షియల్ విజయాలతో మంచి ఊపుమీదున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను.

అయితే తాజాగా బోయపాటి, అల్లుఅర్జున్ కి కొన్ని యాక్షన్ సన్నివేశాలు వివరించాడంట. అవి విపరీతమైన యాక్షన్ సీన్స్ లా ఉండటంతో, ఆ సీన్స్ విన్న అల్లుఅరవింద్ సైతం బోయపాటితో మాట్లాడి, ఆ సీన్స్ ని మార్చమని చెప్పినట్టు తెలుస్తుంది. విపరీతమైన యాక్షన్ వంటి సన్నివేశాలు కాకుండా, అల్లుఅర్జున్ కి తగ్గ సన్నివేశాలను క్రియేట్ చేశాలని సూచించాడట.

మొత్తంగా ఫిల్మ్ నగర్ లో బయటకు వినిపించే టాక్స్ ప్రకారం బోయపాటికి అల్లుఅర్జున్, అల్లుఅరవింద్ క్లాస్ పీకినట్టుగా తెలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతంగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: