మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే పూరీ జగన్నాధ్ షరామాములుగానే తన స్ర్కిప్ట్ రాసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లాడు ఎందుకంటే మనోడు బ్యాంకాక్ బీచ్ దగ్గర ఇసుక తిన్నెలపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అద్భుతమైన డైలాగులు, కథలు బయటకు వస్తాయట పూరికీ అదో సెంటిమెంట్.  చిరుతో తీసే సినిమా  ఆగష్టు 22 న ప్రారంభం  కానుంది,  మరో వైపు మెగాస్టార్ కుడా ఇటివలే లండన్ వెళ్ళాడు.

చిరంజీవి ఫ్యామిలీ ఫోటో


వాస్తవానికి లండన్ వెళ్లింది రెండో కూతురు కోసమే ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ లండన్ లో చదువుతుంది. అక్కడ తను డిగ్రీ పట్టా పుచుకునే సందర్భంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందట అందుకోసమే చిరంజీవి భార్య సురేఖ ఇద్దరు కలిసి వెళ్లారు. పనిలో పని తన ఫిట్ నెస్ కూడా అక్కడ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో చిరంజీవి రెండూ కలిసి వస్తాయి కదా హుటా హుటిన లండన్ వెళ్లాడు.  అక్కడ చాలా స్లీమ్మ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాడట.  మల్లి తనదైన ఫిజిక్ తో ఆకట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు చిరు., అన్నట్టు చిరంజీవి 150 వ సినిమాకు ఆటో జాని అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: