ప్రకృతి అందాలను ఆరాధించే పవన్ కళ్యాణ్ పడమటి కనుమల్లో సందడి చేయబోతున్నాడు. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ అధికారిక సమాచారాన్ని ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ తన ట్విటర్ లో తెలియచేయడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంత వివరాలను తన ట్విటర్ లో తెలియచేసాడు.

నిన్న ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని వివరిస్తూ “యూనిట్ సభ్యులందరూ ఎగ్జైటెడ్‌గా, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉన్నారు’’ అని శరత్ తన ట్విట్టర్ లో తెలియచేసాడు. అయితే పవన్ ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదనీ, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారనీ  శరత్ మరార్ తెలియచేసాడు. మహారాష్ట్రలోని మాల్‌శేజ్ ఘాట్స్ పుణేకు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో తుపాకీలు, గూండాలు, గుర్రాల మధ్య షూటింగ్‌కు శ్రీకారం చుట్టాం అన్న విషయాన్ని శరత్ మరార్ తెలియ చేయడంతో పవన్ అభిమానులకు ఈ వార్త పండుగగా మారింది. 

పడమటి కనుమల్లో  భాగమైన ప్రసిద్ధ మాల్‌శేజ్ ఘాట్స్‌లో చుట్టూ అందమైన లోయలు, పచ్చటి చెట్లు, జంతుజాలం కనిపిస్తాయి. ‘గబ్బర్ సింగ్2’ అన్న స్క్రిప్ట్ కు తగ్గట్లుగా ఆ ప్రాంతాలలోని ప్రకృతి నేపధ్యం ఈ సినిమాకు బాగా నప్పుతుంది అన్న ప్రధాన కారణంతో ‘గబ్బర్ సింగ్ 2’ ను ఈ ప్రాంతంలో మొదలు పెట్టినట్లుగా శరత్ మరార్ తెలియచేసాడు.

ఇక త్వరలో షూటింగ్ లో పాల్గొనబోయే పవన్ తన గెడ్డం అవతారంతో ఈ సినిమాలో కనిపిస్తాడా? లేదంటే గెడ్డం లేకుండా కనిపిస్తాడా అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా శరత్ మరార్ ట్విట్ మాత్రం పవన్ అభిమానులకు మంచి జోష్ ను కలిగిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: