ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీమంతుడు మూవీ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. అలాగే ఆ పోస్టర్ ని చూసిన అందరూ, అందులోని ఎం.బి ప్రొడక్షన్ ని అవాక్కయ్యారు. మహేష్ బాబు సహ నిర్మాతగా శ్రీమంతుడు మూవీకి వ్యవహరించడం అటు అభిమానులతో పాటు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించబోతున్న కోబలి మూవీకి సహ నిర్మాతగా మహేష్ ఉండబోతున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలై మంచి స్పందనని సంతరించుకుంది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు సొంత బ్యానర్ లో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ సంస్థ పేరుతొ మహేష్ ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించనున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ మరొక నిర్మాత.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ త్వరలో పూర్తిచేసుకుని జూన్ రెండవ వారంలో ఆడియో విడుదల జరుపుకోనుంది. అయితే మహేష్ బాబు సహ నిర్మాతగా మరో మూవీకి సన్నాహాలు జరుతున్నయంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అదే పవన్ కళ్యాణ్ నటించబోతున్న కోబలి మూవీ. పవన్ కళ్యాణ్, మహేష్ ల మధ్య మంచి పరిచయాలు ఉండటంతోనే ఇది సాధ్య పడుతుందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: