తెలుగు ఇండస్ట్రీలో విలక్షన నటుడిగా, డైలాంగ్ కింగా పేరు పొందిన మంచు మోహన్ బాబు ఇప్పుడు విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, మంచి నటుడిగా అన్ని రంగాల్లో విశిష్టమైన పేరు సంపాదించుకున్నారు. ఈయన తనయుడులు మంచు విష్షు, మంచు మనోజ్ లు కూడా హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకత సాధించుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డైనమైట్. ఈ సినిమా కోసం మంచు విష్షు సూపర్ లుక్ లో కనిపించ బోతున్నాడట, యాక్షన్, సెంటిమెంట్ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రంపై మంచు విష్ణు చాలా అంచనాలు పెట్టుకున్నాడు.


డైనమైట్ పోస్టర్


తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటించిన ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రాన్ని తెలుగులో విష్ణు, ప్రణీతలతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జులై 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. 

Find out more: