టాలీవుడ్ లో జక్కన్న తీసే ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది అందే కాదు ఈయన తీసే సినిమాలు హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా తీసుకొని చేస్తారని టాక్.  అయితే రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఎక్కడో అక్కడ హాలీవుడ్ సన్నివేశాలు కాపీ కొట్టి తీస్తాడు అన్ని మాటలు వినిపిస్తుంటాయి....తాజాగా ఈ టాక్ ‘బాహుబలి’ సినిమాకు సైతం వచ్చింది. బాహుబలిలో కొన్ని సీన్లు హాలీవుడ్ హిస్టారికల్ మూవి 300 చిత్రానికి పోలికలు ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. 


300 చిత్రం పోస్టర్


ముంబై మీడియా రాజమౌళిని క్లారిఫికేషన్ అడగగా అసలు ఈ టాక్ ఎలా వచ్చిందో తనకు తెలియదని వాస్తవానికి ‘బాహుబలి’ చిత్రంలో యుద్ద సన్నివేశాలు ఉన్నాయి కానీ 300 చిత్రానికి ఈ సినిమాకు అస్సలు పొంతన లేదని సినిమా చూస్తే మీకే అర్థం అవుతుందని జక్కన్న సమాధానం ఇచ్చారు. కాగా జూలై 10 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది బాహుబలి . 



మరింత సమాచారం తెలుసుకోండి: