టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైన కొత్త నటులు వస్తే చాలు, వారి పెర్ఫార్మెన్స్ బాగుంటే వారిని ఎంకరేజ్ చేయటంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందు ఉంటుంది. ఈ విధంగానే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో విలన్ గా పరిచయం అవుతున్న మరాఠీ యాక్టర్ ని, మరో హీరో టార్గెట్ చేశాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెలితే, పవన్ కళ్యాణ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. గబ్బర్ సింగ్2 మూవీలో హీరోకి ధీటుగా మంచి విలన్  ఉండాలని పవన్ కోరుకున్నాడు. పవన్ కోరినట్టే గబ్బర్ సింగ్2కి మంచి విలన్ దొరికాడంట. అందులో భాగంగానే విలన్ కోసం ఎంతో మందిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం ఫైనల్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ ని విలన్ గా ఫైనలైజ్ చేసారు.

అంతే కాకుండా ఇటీవలే జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా పూణేలో శరత్ కేల్కర్ పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తెలుగు రాకపోయినా శరత్ డైలాగ్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకొని తనే చెప్పాడట. శరత్ డెడికేషన్ చూసి ఈ చిత్ర టీం మెచ్చుకుంది. అంతే కాకుండా ఈ విజువల్స్ చూసిన పవన్ కళ్యాణ్ శరత్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.

అయితే శరత్ కేల్కర్ ని ప్రిన్స్ మహేష్ బాబు మూవీలోనూ విలన్ గా పెట్టాలని ఓ దర్శకుడు ఫిక్స్ అయ్యాడంట. బ్రహ్మత్సం మూవీ అనంతరం రాబోతున్న మూవీలో మహేష్ బాబు కి పోటీగా శరత్ కేల్కర్ విలన్ గా నటించే అవకాశం ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. ఇప్పటికే శరత్ కేల్కర్ యాక్షన్ ని మహేష్ డివిడి రూపంలో చూసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: