సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. ఇందులో గ్లామర్ హీరోయిన్స్ కొద్దిగా జాగ్రత్త పడితే, వారికి లేక్కలేనన్ని అవకాశాలు, సత్కాకారాలు, సంపాదించుకునేంది ఆస్తులు తెచ్చుకోవచ్చు. సరిగ్గా ఆ విధంగానే చాలా జాగ్రత్తగా ఫిల్మ్ కెరీర్ ని సాగిస్తున్న హీరోయిన్ ఎమీ జాక్సన్, ఇప్పుడు వరుస అవకాశాలలో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, 'ఎవడు' చిత్రంతో తెలుగు తెరకు దిగుమతైన విదేశీ భామ ఎమీ జాక్సన్‌. అందులో సెకెండ్‌ లీడ్‌ పాత్రలో అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ తమిళ సినిమాలపై మక్కువతో దృష్టంతా అక్కడే నిలిపింది. ఇటీవల శంకర్‌ దర్శకత్వంలో నటించిన 'ఐ సినిమా నిరాశపరిచినప్పటికి సొగసరి అవకాశాలు బాగానే అందుకుంటోంది.

ప్రసుత్తం ఓ రెండు కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. మరో మూడు సినిమాలకు డేట్లు కేటాయించేసింది. 2016 వరకూ అమ్మడు డేట్లు దొరకడం కష్టమే. ఇవి కాకుండా 2017లోనూ ఈ బ్యూటీ మూడు బాలీవుడ్ చిత్రాలను ఇప్పుడే డేట్స్ ని అడ్జెస్ట్ చేసింది.

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హాట్ హీరోయిన్స్ లో ఎమీ జాక్సన్ ఒకరు. అంతే కాకుండా ఫుల్ బిజీ షెడ్యూల్స్ లో ఉన్న హీరోయిన్స్ జాబితాలో, మొదట వరుసలో ఎమీ జాక్సన్ ఉండటం విశేషం. ఇంకో విశేషం ఏమిటంతే, ఎమీ జాక్సన్ ఒప్పుకున్న చిత్రాలు అన్నీంటికి తను ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ ని, కుదిరితే ఫుల్ పేమెంట్ ని తీసుకుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: