తెలుగుతెర సీతమ్మ ఈమధ్య తన లుక్ మార్చి తన స్పీడ్ పెంచడం వెనుక ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రోత్సాహ సహకారాలు బాగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం వీరిద్దరి సాన్నిహిత్యం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘గీతాంజలి’ సినిమా నుండి ప్రారంభమైన వీరి సాన్నిహిత్యం రోజురోజుకు పెరిగి పోతోంది అని టాక్. ఈ సినిమా ఘనవిజయం తరువాత అంజలికి ఒక ఖరీదైన కారును కోన వెంకట్ బహుమతిగా ఇచ్చాడు అనే వార్తలు కూడ గతంలో చాల గట్టిగా వినిపించాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమాలో అంజలి ప్రధాన హీరోయిన్ గా ఎంపిక కావడం వెనుక కోన వెంకట్ చాల పెద్ద వ్యూహమే నడిపాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్న కోన వెంకట్ అంజలి పాత్రను పెంచి మొదట్లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది అనుకున్న ప్రణిత పాత్రను తగ్గించి వేయడంతో కోపంతో బాలయ్య ‘డిక్టేటర్’ నుండి ప్రణిత తప్పుకుంది అన్నా వార్తలు కూడ ఉన్నాయి.  

అదేవిధంగా నిఖిల్ హీరోగా కోన వెంకట్ రచన చేస్తూ నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ సినిమాలో కూడ అంజలి ఒక దొంగల ముఠాకు గ్యాంగ్ లీడర్ గా ఎంపిక కావడం వెనుక కూడ కోన వెంకట్  హస్తం ఉంది అని అంటున్నారు. అంతేకాకుండా కోన వెంకట్ తనకు సాన్నిహిత్యం ఉన్న దర్శక నిర్మాతల వద్ద అంజలిని తెగ ప్రయోట్  చేస్తూ ఉండతంతో సీతమ్మకు ఇంకా ఎన్ని అవకాశాలు కోన వెంకట్ ఇప్పిస్తాడో?  అంటూ అతడి పై సెటైర్లు పడుతున్నట్లు టాక్. 

కోలీవుడ్ లో పూర్తిగా అవకాశాలు తగ్గి పోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ ను శాశ్విత చిరునమాగా  చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అంజలి ప్రయత్నాలకు ఈ కొత్త గాడ్ ఫాదర్ సహాయం ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: