ఇప్పుడు దేశం మొత్తం మీద ఒక్క సినిమా గురించే టాక్.. అదే ‘బాహుబలి’. రాజమౌళి రెండున్న సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ సినిమా జూలై 10 న తెలుగు,తమిళ,హిందీ భాషల్లో విడుదల అవుతుంది. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇక టాలీవుడ్ లో సూపర్ హిట్ దర్శ,నిర్మాత కరణ్ జోహార్  బాహుబలికి సంబంధించి హిందీ హక్కులను సొంతం చేసుకుని అక్కడ విడుదల చేస్తున్నాడు. అందుకే అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా చేశాడు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా దక్షిణాది సినిమా అయిన బాహుబలికి బాలీవుడ్‌లోనూ భారీ ప్రచారం జరుగుతోంది.  


సల్మాన్ ఖాన్, సూర్య


ఇక ‘బాహుబలి 2 ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో ఇప్పుడున్న పాత్రలతో పాటు కొత్త పాత్రలు రాబోతున్నట్లు సమాచారం దీనికోసం తమిళ స్టార్ సూర్య నటించబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు ‘బాహుబలి 2’కి బాలీవుడ్‌ లో మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ను నటింపచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అయితే సల్మాన్ ఈ సినిమాలో గనక వస్తే సినిమాకు మరింత పాపులారిటీ పెరుగుతుందని ఆయన అభిమానులు దేశం మొత్తం ఉన్నందున ఈ సినిమాకు మంచి హైలెట్ అవుతుందని కరణ్ ఉద్దేశం. ఇప్పటికే బాహుబలి గురించి తెలుసుకున్న సల్మాన్ ఈ ప్రపోజల్‌కు ఎలా స్పందిస్తాడో చూడాలి.


బాహుబలి పోస్టర్


మరింత సమాచారం తెలుసుకోండి: