టాప్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత గ్లామర్ క్వీన్. దక్షిణాది సినిమా ప్రేక్షకులలో లక్షలాది మంది ఆమె గ్లామర్ ను అభిమానించే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో విక్రమ్, ధనుష్ లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత తిరిగి మహేష్ బాబుతో మూడవసారి నటించబోతోంది. 

గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు గాంచిన సమంత తన అందo పై తానే సెటైర్లు వేసుకోవడం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తమిళ భాషలో ప్రచురితమయ్యే ఒక ప్రముఖ తమిళ వార పత్రికకు సమంత ఇంటర్వ్యూ ఇస్తూ తన అందం పై తాను సెటైర్లు వేసుకుంది. తన స్కూల్ కాలేజీ రోజులలో ఎవరైనా అబ్బాయి తన వైపు ఆరాధనగా చూస్తూ తన అందం గురించి పొగడాలని ఆశపడుతూ ఉన్నా ఎవరూ తనను పట్టించు కోకుండా ఉండటంతో తాను అందగత్తెను కాను అన్న అభిప్రాయానికి తన చిన్న తనంలోనే వచ్చేసాను అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే అనుకోకుండా సినిమాలలోకి వచ్చిన తరువాత వరస పెట్టి విజయాలు రావడంతో తన గ్లామర్ ను మెచ్చుకుంటూ అదేవిధంగా తాను చాల అందగత్తెను అని చాలామంది తన వెంట పడుతూ ఉంటే తనకు ఆశ్చర్యం కలుగుతోంది అని అంటూ తాను ఒక మోస్తరు ఫిగర్ ని మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత.

తనకన్నా అందగత్తెలు ఎందరో ఈ సినిమా రంగంలో ఉన్నారని అయితే తనను అందంగా చూపించడానికి విపరీతంగా కష్టపడే హెయిర్ స్టైలిస్ట్ దగ్గర నుంచి డ్రెస్ డిజైనర్ వరకు ఎందరో పడుతున్న శ్రమ వల్ల మాత్రమే తాను అందగత్తెగా మారగాలిగాను అన్న సత్యం తనకు తెలుసు అని తన పై తానే సెటైర్లు వేసుకుంది సమంత. అంతేకాదు తాను ఆశించిన జీవితం తనకు లభించడం వల్ల తన అందం మరింత పెరిగి ఉండవచ్చు అని అభిప్రాయాన్ని వెల్లడించింది సమంత..   



మరింత సమాచారం తెలుసుకోండి: