తెలుగు ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి జూలై 10 న తెలుగు , తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న చిత్రం ‘బాహుబలి’ . ఈ సినిమా గురించి నటులు నటించలేదట జీవించారట. ప్రతి రోజు దాదాపు 18 గంటలకు పైగా సినిమా గురించే కేటాయించేవారట. ‘బాహుబలి’ జానపద చిత్రం కాబట్టి ఇందులో కత్తియుద్దాలు, కర్ర సాముల చాలానే ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా చేయాల్సి వచ్చే సందర్భాలు ఉన్నాయట. దీనికోసం తమన్న కత్తి సాము నేర్చుకోడానికి రాత్రింబవళ్లు కష్టపడిందట. ఇప్పటికే బాహుబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాలో హడావుడి చేస్తోన్న తమన్నా సినిమా విశేషాలను ఇంట్రస్టింగ్ చెప్పింది.


బాహుబలి పోస్టర్


వాస్తవానికి తనకు కత్తి సాము సంగతి దేవుడెరుగు  కత్తి పట్టుకోవడం కూడా సరిగా రాదట ఫైటింగ్ లు స్టంట్ మాస్టర్ చెప్పినప్పుడు సరిగా రాలేదు అంతే కాదు అప్పుడు కాస్త సిగ్గు పడేదట. కానీ ఎలాగైనా కత్తి సాము నేర్చుకోని జక్కన్నను మెప్పించాలని ప్రభాస్ సాయం తీసుకునేదట. రోజుకు 18 గంటలకు పైగానే షూటింగ్ లో పాల్గొన్నా కానీ ఎంతో ఓపికతో ప్రభాస్, రానా తనకు నేర్పించారని ఈ సందర్భంగా వాళ్లకు థ్యాంక్స్ చెప్పింది. తన లైఫ్ లో ఎప్పుడూ ఈ సినిమాకు పడ్డ కష్టం మరే సినిమాకు పడలేదని కానీ అంతే రిజల్ట్ కూడా ఉంటుందని తమన్న సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: