టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజిగా మారిన రెజీనా, ఒక్కసారిగా తన ఫిల్మ్ కెరీర్ డైలమాలో పడేసరికి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం తన చేతిలో రెండు తెలుగు మూవీలు మాత్రమే ఉన్నాయి. అయితే మరో మూడు ప్రాజెక్ట్స్ లు వర్కింగ్ లో ఉన్నప్పటికీ, అవి ఎంతకీ తేలడంలేదు.  


గతంలో రెజీనాకి పిలిచి ఆఫర్స్ ఇచ్చిన ప్రొడ్యూజర్స్, ఇప్పుడు మాత్రం రెజీనా ఆమడ దూరం వెళుతున్నారంట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పిల్లా నువ్వు లేని జీవితం మూవీ తర్వాత పత్తా లేకుండా పోయింది రెజీనా కాసండ్ర. ఈ సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా తెలుగులో అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.


ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్ సరసన శంకర అనే మూవీ


ఆ మధ్య కోలీవుడ్ లో రాజతంతిరం అనే సినిమాలో నటించి తమిళ తంబీలను బాగానే మురిపించింది. ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్ సరసన శంకర అనే మూవీతో పాటు.. సాయిధరమ్ తేజ్ సరసన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లోనూ ఆడిపాడుతోంది ఈ చెన్నై బ్యూటీ. ఈ బ్యూటీ ప్రయత్నాలు బాగానే ట్రై చేస్తున్నా.. ఎందుకో రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలా హాట్ ఛాయిస్ కాలేకపోయింది.


ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో.. పాష్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చి సూపర్ స్టైల్ తో ఆడియెన్స్ ను చూపులతోనే చంపేస్తోంది.  గతంలోనూ ఆఫర్స్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చాలానే చేసింది రెజీనా. కానీ ఈ బ్యూటీకి మైలేజ్ మాత్రం పెద్దగా రాలేదు. ఇప్పుడు కూడా అమ్మడి స్టయిల్ కి ఫ్లాటయ్యే ప్రొడ్యూసర్స్ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో, రెజీనా షాక్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: