ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బాహుబలి మూవీకి సంబంధించిన రిలీజ్ కోసం ఎదరు చూస్తుంటే,  జక్కన్న రాజమౌళి మాత్రం అప్పుడే బాహుబలి2 మూవీని ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి అన్న దానిపై పక్కా క్లారిటిలో ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రాజమౌళి దర్శకత్వం వహించిన  బాహుబలిని రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి అందరికీ తెలిసిందే.

అందులో ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే టైటిల్ తో రానున్న మొదటి పార్ట్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇంకా 10 రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఇదే టైం కి వస్తుందని రాజమౌళి ఇదివరకే క్లారిటి ఇచ్చాడు.

బాహుబలి పార్ట్2 కోసం ఇంకా 605 సిజి షాట్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వంటివి ఇంకా కంప్లీట్ అవ్వాలి. మిగిలిన60% షూట్ ని ఫినిష్ చెయ్యడం కోసం 120 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. అలాగే సెకండ పార్ట్ కి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది.

అందుకే ఈ చిత్ర టీం సెకండ్ పార్ట్ కోసం ఏడాది గ్యాప్ తీసుకుంటున్నారు. మొత్తంగా రాజమౌళి ఆగష్టు నెల నుండి రెగ్యులర్ గా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడంటూ క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: