‘బాహుబలి’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలై అందరూ బాహుబలి విడుదల రోజుకోసం ఎదురు చూస్తూ ఉంటే ‘బాహుబలి’ సినిమాను మొట్టమొదటిగా సారిగా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు సెన్సార్ సభ్యులు కొంత మంది రాజమౌళి వద్ద చేసిన కామెంట్స్ రాజమౌళికి నిద్ర లేకుండా చేస్తున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఈరోజు సెన్సార్ సభ్యులు ‘బాహుబలి’ పై చేసిన కామెంట్స్ కు సంబంధించిన కథనాన్ని ప్రచురించి ‘బాహుబలి’ పై మరింత ఆ శక్తిని పెంచింది.

“బాహుబలి” బిగినింగ్ పార్ట్ వన్ సినిమా ప్రధమ భాగంలో వచ్చే సీన్స్ లో రానా డామినేషన్ ముందు ప్రభాస్ నిలబడలేక పోయాడని సెన్సార్ సభ్యులు కామెంట్స్ చేసినట్లు టాక్. దీనితో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రభాస్ హీరోనా ? లేక రానా హీరోనా అన్న అనుమానం కలుగుతుందని అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ నట విశ్వరూపం ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో కనిపించినా రానా మాత్రం ‘బాహుబలి’ సినిమా మొత్తంలో బాగా ఎలివేట్ అవ్వడం ప్రభాస్ అభిమానులకు షాకింగ్ గా మారే అవకాశం ఉందని కామెంట్లు చేసినట్లు టాక్. 

అంతేకాకుండా ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఓవర్ డోసేజ్ పబ్లిసిటీని తగ్గించమని లేకుంటే ఈ పబ్లిసిటీ హైక్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసి సినిమా భారీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు  రాజమౌళిని హెచ్చరించినట్లు టాక్. అయితే ఈ విషయాల పై రాజమౌళి స్పందిస్తూ తాను అడగకుండానే అన్ని ప్రముఖ పత్రికలు అలాగే అన్ని ప్రముఖ ఛానల్స్ ‘బాహుబలి’ వార్తలతో ప్రతిరోజు హడావిడి చేస్తున్నారని ఇలాంటి పరిస్థుతులలో వారిని నియంత్రించే శక్తి తనకు లేదు కదా అని సెన్సార్ బోర్డ్ సభ్యులు వద్ద కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ‘బాహుబలి’ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రేమ సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా నింపి సెకండ్ ఆఫ్ లో భారీ యుద్ధ సన్నివేశాలను కూర్చిన రాజమౌళి వ్యూహాత్మక ఎత్తుగడ అర్ధంకాక ‘బాహుబలి’ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఒక గంట సేపు ఖంగారుపడే అవకాశం ఉందని అందువల్ల ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ముగింపుకు వచ్చాక ప్రేక్షకులు ఇచ్చే తీర్పుతో ‘బాహుబలి’ సక్సస్ ఆధారపడి ఉందని కామెంట్ చేస్తూ ‘బాహుబలి’ సినిమా ఓవర్ డోస్ పబ్లిసిటీ ఈ సినిమాకు నష్టం కలిగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని రాజమౌళికి సెన్సార్ సభ్యులు మరీమరీ సూచించారని ఆ పత్రిక కథనం..



మరింత సమాచారం తెలుసుకోండి: