తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే అంటూ వచ్చి తెలుగు వారి మనసు దోచిన మలయాళి ముద్దుగుమ్మ సమంత అదృష్టం అలా అలా కలిసి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన ఈ అమ్మడు కొంచెం నోటి దూల ఎక్కువే.. ఎందుకంటే ఆ మధ్య తన తోటి హీరోయన్లపై కామెంట్ చేసి తర్వాత వారితో చివాట్లు తిన్నది. ఆ తర్వాత అవార్డు సినిమాల గురించి కామెంట్ చేసింది. సిద్దార్థతో  బ్రేకప్ ఇచ్చిన తర్వాత తెలుగు లో కాస్త ఆఫర్లు తగ్గాయి.  అమ్మ‌డు తెలుగు ఇండ‌స్ట్రీపై దృష్టి త‌గ్గించి.. త‌మిళ్ కి వెళ్లిపోయినా మ‌న ద‌ర్శ‌కులు మాత్రం చైన్నైబ్యూటీని అంత ఈజీగా వ‌ద‌ల్లేక‌పోతున్నారు.

దూకుడు సినిమాలో సమంత, మహేష్ బాబు


ఇప్పుడు తమిళ్ లో బిజీ బిజీగా మారిపోయింది  విజ‌య్, సూర్య‌, విక్ర‌మ్, ధనుష్ లాంటి హీరోల‌తో బిజీ అయిపోయింది స‌మంత‌. ఈ అమ్మడు తమిళ సినిమాలపై కన్నేసినా మన తెలుగు దర్శకులు, హీరోలు మటుకు సమంతను వదలడం లేదు.   అందుకే వెతుక్కుంటూ మ‌రి మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం వెళ్లి స‌మంత ఖాతాలో ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ తో ఒక్క‌సారి న‌టించ‌డ‌మే గొప్ప‌ని పొంగిపోయే హీరోయిన్లున్నారు.. కానీ స‌మంత‌కు మాత్రం ఏకంగా మూడో సారి అవ‌కాశ‌మిచ్చేసాడు మ‌హేశ్. తెలుగు లో మళ్లీ అమ్మడు అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.


బ్రహ్మోత్సవం పోస్టర్


మరింత సమాచారం తెలుసుకోండి: