రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘బాహుబలి’ ఇప్పటి వరకు సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా సినిమాలు విడుదల అయిన ఆ సినిమా హిట్టా..ఫట్టా అనే వార్తలు వస్తాయి కానీ ‘బాహుబలి’ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిత్రానికి రాని హైక్ వచ్చింది. ఇప్పుడు రాజమౌళికి సెన్సార్ ఫివర్ పట్టుకుందట..?   ఎందుకంటే‘బాహుబలి’ సినిమాను మొట్టమొదటిగా సారిగా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు సెన్సార్ సభ్యులు కొంత మంది రాజమౌళి వద్ద చేసిన కామెంట్స్ రాజమౌళికి నిద్ర లేకుండా చేస్తున్నాయాని తెలుస్తోంది. దీనికి ఊతం ఇస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక  సెన్సార్ సభ్యులు‘బాహుబలి’పై చేసిన కామెంట్స్ కు సంబంధించిన కథనాన్ని ప్రచురించి దీనికి గురించి తెలుసుకున్న రాజమౌళికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

బాహుబలి పోస్టర్


ఆ పత్రిక కథనం ప్రకారం మొదటి భాగంలో వచ్చే సీన్స్ లో రానా డామినేషన్ ముందు ప్రభాస్ నిలబడలేక పోయాడని సెన్సార్ సభ్యులు కామెంట్స్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ప్రభాస్ హీరోనా? లేక రానా హీరోనా అనే అనుమానం కలుగుతుందని అభిప్రాయం వేల్లదిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ నట విశ్వరూపం ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో కనిపించినా రానా మాత్రం ‘బాహుబలి’ సినిమా మొత్తంలో బాగా ఎలివేట్ అవ్వడం ప్రభాస్ అభిమానులకు షాకింగ్ గా మారే అవకాశం ఉందని కామెంట్లు చేసినట్లు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: