అఖిల్ ను హీరోగా చేసి భారీ సినిమాను తీస్తున్న నితిన్ వ్యవహార శైలి నాగార్జునకు టెన్షన్ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఒక కొత్త హీరో స్థాయికి మించి నితిన్ ఖర్చు పెడుతున్న భారీ బడ్జెట్ తో అఖిల్ వినాయక్ ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అప్పుడే బయ్యర్లలో భారీ అంచనాలు పెరిగాయి. 

ఈ క్రేజ్ తో ఈసినిమాను కొందామని నితిన్ దగ్గరకు వస్తున్న బయ్యర్లకు నితిన్ అతడి తండ్రి ఈసినిమా హక్కుల గురించి చెపుతున్న భారీ మొత్తాలు  బయ్యర్ల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఈ సినిమాను కొనడానికి వచ్చిన బయ్యర్లు చెపుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు. 

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నాగ్ నటించినా కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ నాగ్ 40 కోట్ల టార్గెట్ ను కూడా చేరుకొని నేపధ్యంలో అదే కుటుంబం నుండి వస్తున్న అఖిల్ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చినా కలెక్షన్స్ పరంగా 40 కోట్ల మైలురాయిని దాటడం కష్టం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో అఖిల్ సినిమాను అంత భారీ మొత్తాలు పెట్టి కొంటే ఇప్పుడు ఉన్న పోటీ పరిస్థితులలో వర్కౌట్ కాదు అని బయ్యర్స్ నితిన్ ముందు కామెంట్ చేస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా అఖిల్ నటిస్తున్న సినిమాకు సంబంధించి  బయటకు వచ్చిన వీడుయోలు అన్నీ అతడి యాక్షన్ సీన్స్ కు  సంబంధించి ఉన్నాయి కాని అతని డైలాగ్ డెలివరి మరియు డాన్సింగ్ స్కిల్స్ కు సంబంధించి లేకపోవడంతో వినాయక్ అఖిల్ ను పెట్టి పూర్తిగా యాక్షన్ సీన్స్ తో జాకి చాన్, జెట్ లీ సినిమాల తరహాలో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ కామెంట్స్ అన్నీ  నాగార్జున దృష్టికి కిరావడంతో అఖిల్ వినాయక్ ల సినిమా విషయంలో ఏమి జరుగుతోంది అన్న టెన్షన్ నాగార్జునకు రోజురోజుకు పెరిగి పోతుంది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: