తెలుగు ఇండస్ట్రీకి ‘జయం’ అనుకుంటూ వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న హీరో నితిన్. అయితే నితిన్ సినిమాల విజయాలు మటుకు వేళ్లపై లెక్కించ వచ్చు కానీ మనోడి ఇమేజ్ మటుకు ఎక్కడా దెబ్బ తినలేదు. ఆ మద్య వచ్చిన ఇష్క్, గుండెజారి సినిమాల‌తో పూర్తిస్థాయి ఫామ్ లోకి వ‌చ్చిన నితిన్ మంచి హిట్లనే అందుకున్నాడు. ఇక కెరీర్ గాడిలో పడింది అనుకున్న సమయంలో హార్ట్ ఎటాక్ సినిమా వచ్చింది ఈ సినిమా హిట్ అయ్యింది కానీ సూపర్ డూపర్ హిట్ రేంజ్ కు వెళ్లలేదు... తర్వాత చిన్నదాన నీకోసం సినిమా అయితే పూర్తిగా కొంప ముంచింది.  


హార్ట ఎటాక్ పోస్టర్



వ‌ర‌స విజ‌యాలు వ‌స్తున్న టైమ్ లో అనుకోని అడ్డంకిగా నిలిచిన ఈ ప‌రాజ‌యాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకున్నాడు నితిన్. ఇకపై కథ విషయంలో ఎలాంటి పొరపాటు చేయరాదని కాస్త లేట్ అయినా ఆచి తూచీ అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మద్య పూరీ జగన్నాధ్ తో మరో సినిమా తీయానుకున్నా అది కుదరలేదు. ఇప్పుడు మ‌ల్లిడి వేణు అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమాకు సిద్ద‌మ‌వుతున్నాడు నితిన్. ఈ సినిమాకు వెలిగొండ శ్రీ‌నివాస్, కృష్ణ‌చైత‌న్య క‌థ అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: