నిన్న అమెరికాలో ప్రారంభమైన నార్త్ అమెరికా తెలుగు సంఘం (NATS) తెలుగు సంబరాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకటేష్ తాప్సీల హంగామా నాట్స్ సంబరాలకు హాట్ టాపిక్ గా మారింది. జూలై 2 నుంచి 4 వ తేదీ వరకూ జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిధిగా వెంకటేష్ తో పాటుగా ఢిల్లీ బ్యూటీ తాప్సీ కూడ హాజరు కావడంతో ఒకనాటి ‘షాడో’ కాంబినేషన్ రిపీట్ అయింది అంటూ సెటైర్లు పడ్డాయి. 

గతంలో  తాప్సీ, వెంకటేష్ కాంబినేషన్ లో ‘షాడో’  చిత్రం వచ్చినా వీరి జంట ఆ సినిమాకు విజయాన్ని సమకుర్చలేక పోయింది. అయినా ఈ ఉత్సవాలలో వీరి హంగామా తెలుగువారిని బాగా ఆకర్షించింది.  నిన్నటి నుంచి అమెరికాలోని రెండు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాలు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్‌) తమ ద్వైవార్షిక మహాసభలను గురు, శుక్ర, శనివారాల్లో ఒకరికిఒకరు పోటీగా నిర్వహిస్తూ తెలుగు సినిమా రంగానికి చెందిన సెలెబ్రెటీలను పిలిచి హడావిడి చేస్తున్నారు. 

నిన్న ఈ తానా మహాసభలు డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో అత్యంత ఘనంగా ప్రారంభం అయితే నాట్స్‌ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్‌ సెంటర్‌లో హంగామాగా ప్రారంభం అయ్యాయి. అయితే ఒకేసారి ఒకే నెల ఒకే తేదీలలో ఇలా పోటాపోటీగా అమెరికాలోని తెలుగు సంఘాలు కార్యక్రమాలు నిర్వహించడం అమెరికాలోని తెలుగు వారికి ఆనందాన్ని ఇస్తున్నా తెలుగు ప్రజలకు ఏ విషయంలోనూ ఐక్యత లేదు అన్న విషయానికి సంకేతంగా ఇలా రెండు అమెరికాలోని రెండు తెలుగు సంఘాలు పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఏమిటి అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఇక నాట్స్‌ సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, నిమ్మగడ్డ ప్రసాద్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌, విమలా రామన్‌, కమలిని ముఖర్జీ, అనూప్‌ రూబెన్స్‌, వందేమాతరం, సిరాశ్రీ, గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొంటు ఉండటంతో ప్రస్తుతం అమెరికాలోని ప్రతి ఇంటా ఈ ఉత్సవాల హడావిడి కనిపిస్తోంది. అయితే  నాట్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖులే తానా ముగింపు ఉత్సవాలలో కూడ పాల్గొంటూ ఉండటంతో అక్కడ కూడ మన సెలెబ్రెటీలు ద్విపాత్రాభినయం చేస్తున్నాటు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: