ప్ర‌స్తుతం సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అనుష్క న‌టిస్తున్న అప్ క‌మింగ్ మూవీ జీరోసైజ్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన నిజాలు బ‌య‌ట‌కు తెలిసాయి. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, స్టార్ హీరోస్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క. ఇక‌ అనుష్క చేస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జీరో సైజ్’.

రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అనుష్క – ఆర్యలపై వచ్చే లవ్ సీన్స్, లవ్ ప్రపోజల్ సీన్స్ తీస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కీలక మైన సీన్స్ అని ఈ చిత్ర టీం తెలిపింది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అనుష్క కూడా ఈ సినిమా కోసం కంటిన్యూ గా షూటింగ్ ఫినిష్ చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది.

అందులో ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు కూడా పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో అనుష్క‌, ఆర్య ల మ‌ధ్య ఘూడ‌మైన ముద్దు సీన్స్ ఉన్న‌ట్టుగా చిత్ర‌యూనిట్ నుండి లీక్స్ ద్వార బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అనుష్క మొద‌టిసారిగా లిప్ లాక్ సీన్స్ లో ఫుల్ లెన్త్ లిప్ లాక్స్ ని చేసిన మూవీగా జీరోసైజ్ ఉండిపోతుందంటున్నారు. ఆర్య‌తో దాదాపు 2 నిముషాల పాటు ఉంటే హాట్ సీన్స్ లో వీరిద్ద‌రి మ‌ధ్య ఎక్కువుగా ముద్దుసీన్స్ ఉన్నాయ‌నే చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న క్లియ‌ర్ టాక్స్.

పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: