‘బాహుబలి’ విడుదల టెన్షన్ తో సతమతమై పోతున్న రాజమౌళికి లేటెస్ట్ గా రానా కోరిన ఒక విచిత్రమైన కోరిక ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా కొంత అసహనాన్ని సృస్టించింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే వినడానికి ఆశ్చర్య కరంగా ఉన్న రానా ఈ కోరిక వివరాలలోకి వెళితే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. 

‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవా గా నెగిటివ్ పాత్రను పోషిస్తున్న రానా తన మహిష్మతి రాజ్యంలో ప్రజలు తనను దేవుడిగా ఆరాధించాలని ఒక భారీ విగ్రహాన్ని తన కోట ముందు పెట్టుకుంటాడు. అహంకారిగా రానా చేసే అకృత్యాలతో ఆ రాజ్యం సతమతమైపోతూ ఉంటే అమాయకులైన ప్రజలకు శిక్షలు వేసే రానా తన శిక్షలను తన సైనికుల చేత తన భారీ విగ్రహం ముందు అమలు జరిపిస్తూ ఉంటాడు. 

అయితే ఈ సన్ని వేసాల చిత్రీకరణకు సంబంధించి అటువంటి భారీ విగ్రహాన్ని తయారు చేయకుండా గ్రాఫిక్ లో అటువంటి బొమ్మను చూపించవచ్చు. కానీ రాజమౌళి రానా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత రీత్యా అత్యంత భారీ విగ్రహాన్ని తయారు చేయించాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి లక్షలలో ఖర్చు అయింది అని అంటారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి దానికి సంబంధించిన కోట సెట్ ను విప్పివేయడం జరిగినా రామోజీ ఫిలిం సిటీలోని ఒక ప్రాంతంలో రానా పాత్రకు కోసం తయారు చేసిన ఆ భారీ విగ్రహం అలానే ఉంది.

దీనితో రానా కు ఆ బొమ్మను ఎలాగైనా రాజమౌళిని ఒప్పించి రామోజీ ఫిలిం సిటీ నుండి బయటకు తీసుకు వచ్చి తన రామానాయుడు స్టూడియోస్ లో ఒక ముఖ్య ప్రాంతంలో పెట్టాలని రానా కోరిక అని టాక్. ఈ విషయాన్ని స్వయంగా రానా రాజమౌళిని అడిగితే ‘బాహుబలి’ విడుదల తరువాత ఈ విషయమై ఆలోచిద్దాం అంటూ తప్పించుకున్నాడని టాక్. అయితే ఇంత భారీ విగ్రహాన్ని రామోజీ ఫిలిం సిటీ నుండి రామానాయుడు స్టూడియోస్ తీసుకు రావడానికి ఎంత కష్టం అవుతుందో అనే విషయం పై అవగాహనతో రానా ఈ కోరిక కోరాడా లేదంటే ఎంత కష్టమైనా తన కోర్క నెరవేర్చుకోవడానికి రానా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడా అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా రానా తన బొమ్మ కోరిక మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: