తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం నందమూరి హీరోలు హంగామా చేశారు. మొదట ‘ఫటాస్’ తో కళ్యాన్ రామ్ తర్వాత ‘టెంపర్’ తో జూనియర్ ఎన్టీఆర్ ఇక లయన్ సినిమతో నందమూరి నటసింహం తన ప్రతాపాన్ని చూపించారు. ఎన్టీఆర్ అనుకున్నట్టే నందమూరినామ సంవత్సరం చేశారు. ఇప్పుడు ఇదే ఊపుతో కళ్యన్ రామ్ కొత్త చిత్రం టైటిల్’ షేర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు ఈ రోజు కళ్యారామ్ పుట్టిన రోజు సందర్భంగా’ షేర్‌’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.


పటాస్ పోస్టర్


ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ చేస్తే ‘ఫటాస్’ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది అంటున్నారు నందమూరి అభిమానులు. ఈ చిత్రానికి కత్తి సినిమాకు దర్శకత్వం వహించిన మల్లికార్జున్ దర్శకత్వం చేస్తున్నాడు. లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయి నిహారిక సమర్పణలో కొమర వెంకటేష నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయనున్నట్లు తెలిపాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: