ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలెబ్రెటీలు తమ ట్విటర్ ద్వారా తమ అభిమానులతో లైవ్ కాంటాక్ట్ లోకి వస్తూ అభిమానులు అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తమ ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈ పద్ధతినే అనుసరిస్తూ నిన్న హీరో రానా తన అభిమానులతో వెబ్ మీడియాలో సంభాషిస్తూ అనేక చిలిపి ప్రశ్నలకు కూడ తనదైన స్థాయిలో సమాధానాలు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. 

గత కొద్ది రోజులుగా మహేష్ బాబు రాజమౌళిల కాంబినేషన్ లో ‘బాహుబలి 2’ తరువాత ఒక సినిమా వస్తుంది అని వార్తల హడావిడి జరగడమే కాకుండా ఆ సినిమాను ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తాడు అంటూ వార్తల వస్తున్న నేపధ్యంలో ఒక అభిమాని రానాను మహేష్ హీరోగా రాజమౌళి తీయబోయే సినిమాలో విలన్ గా చేస్తారా ? స్నేహితుడుగా కనిపిస్తారా ? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నథింగ్’ (NOTHING) అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. 

అంతేకాదు మరో అభిమాని రామ్ చరణ్, అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్ ల గురించి ఒక్క పదంలో చెప్పమంటే ‘చరణ్ – మంచి స్నేహితుడు, బన్నీ – లైవ్ వైర్, పవన్ కళ్యాణ్ – పవర్స్ స్టార్’ అంటూ ఒక్క మాటలో ఈ ముగ్గురు పై తన అభిప్రాయాలను వెల్లడించాడు.బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తన అభిమాన హీరో అని చెప్పిన రానా తనకు బాలీవుడ్ హీరోల ఖాన్ త్రియమ్ లో షారుఖ్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పడమే కాకుండా తన వ్యక్తిత్వం తెలుసుకోవాలి అంటే తాను సినిమాలలో నటించిన పాత్రలు అన్నింటినీ ఒక మూసగా పోస్తే రానా అసలైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది అంటూ తన పై తాను సెటైర్లు వేసుకున్నాడు రానా. 

మరో ఊహించని ట్విస్ట్ ఏమిటంటే మహేష్ రాజమౌళిల సినిమాలో నటించడానికి ఇష్టపడని రానా చిరంజీవి 150వ సినిమాలో మటుకు చిన్న పాత్ర ఇచ్చినా చాలు అంటున్నాడు. మహేష్ పై రానా వ్యక్త పరిచిన ఈ కామెంట్స్ పై, ప్రిన్స్ అభిమానులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: