ఈ వారం విడుదల కాబోతున్న ‘బాహుబలి’ ఫీవర్ అన్ని వర్గాల ప్రజలను వైరస్ లా కుదిపేస్తు ఉండటంతో ఆరోజు ‘బాహుబలి’ చూసితీరాలి అని అనుకుంటున్న ఉద్యోగులకు తమ బాస్ లకు ఎలా లీవ్ లెటర్స్ వ్రాసి జూలై 10 వచ్చే సుక్రువారం సెలవు సంపాదించాలో తెలియచేస్తూ ఒక నమూనా లీవ్ లెటర్ ఫార్మేట్ ‘బాహుబలి’ టీమ్ మీడియాకు రిలీజ్ చేసింది. 

‘నేను జూలై 10వ తారీఖున ఆఫీసుకు రాకపోవడం వల్ల ఆఫీసు పనులు ఆగిపోతాయని నాకు తెలుసు. కానీ ‘బాహుబలి’ పై బెంగతో నేను ఆరోజు ఆఫీసుకు వచ్చి కూర్చున్నా పని విషయంలో నేను ఆఫీసుకు ఏ విధంగాను ఉపయోగాపడను అన్న ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్తుతులలో సెలవు పెట్టి ‘బాహుబలి’ కు వెళ్ళి పోతున్నాను క్షమించండి’ అంటూ లీవ్ లు పెట్టండి చెపుతూ ‘బాహుబలి’ టీమ్ కొత్త ప్రచారం మొదలు పెట్టింది.

అసలు ఈ సమస్యలు ఏమిలేకుండా రాజమౌళి జూలై 10వ తారీఖున ఇరు రాష్ట్రాలలోని ప్రజలందరికీ జాతీయ పండుగలా సెలవు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు బాహుబలి పై సెటైర్లు వేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న ఆదివారం సాయంత్రం బీబీసీ ఆసియా విభాగంలో రాజమౌళి ఇంటర్వ్యూను బీవీసి ప్రచారం చేయడం ‘బాహుబలి’ స్థాయిని మరోసారి చాటింది. ఇక ఇరు రాష్ట్రాలలోని థియేటర్లలో ‘బాహుబలి’ టిక్కెట్లు దొరికితే అది పండుగే అన్న వాతావరణం మొదలైపోయింది. 

కోస్తా తెలంగాణ ప్రాంతాలలోని చిన్నచిన్న పట్టణాలలో పలు ధియేటర్లు  యూనిఫారమ్ రేటుకు ‘బాహుబలి’ టికెట్లను అమ్మడానికి రెడి అయిపోతున్నాయి. బెంచీ, కుర్చీతో సంబంధం లేకుండా మల్టీ ఫ్లెక్ట్ ల మాదిరిగా 200 రూపాయలు రేటు పెట్టి టిక్కెట్ల అమ్మకానికి రంగం సిద్దమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు బాహుబలి ఫీవర్ టాప్ కు చేరిపోయింది. ఎక్కడ చూసినా టికెట్ ఎలా అన్న డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాలలోని  దాదాపు 95శాతానికి పైగా థియేటర్లలో ఒకే సినిమావిడుదల కావడం టాలీవుడ్ చరిత్రలో ఇదే ప్రధమం అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ‘బాహుబలి’ వైరస్ జనాన్ని కుదిపెస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: