ప్రభాస్ ఇంటర్వ్యూలతో జాతీయ మీడియాకు సంబంధించిన పత్రికలు కూడ హోరెత్తిపోతున్నాయి. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ప్రభాస్ కామెంట్స్ తన ‘బాహుబలి’ సినిమాను ఉద్దేసించినవే అయినా ఈ కామెంట్స్ చాల వ్యూహాత్మకంగా చేసాడు అని అనిపిస్తోంది.

కేవలం ఒకే ఒక్క సినిమా కలెక్షన్స్ బట్టి ఆ సినిమాకు ఖర్చు పెట్టిన బడ్జెట్ ను బట్టి ఆ సినిమాలో నటించిన హీరోకు నెంబర్ వన్ స్థానం వస్తుంది అని అనుకుంటే అది పొరపాటే అని వ్యాఖ్యలు చేసాడు ప్రభాస్. టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం అందుకోవాలి అంటే చాల సుధీర్ఘ ప్రయాణం ఉంటుందని దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడ చాల విభిన్నంగా ఉంటాయని అందువల్ల తాను ‘బాహుబలి’ తో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిపోతాను అన్న నమ్మకం తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు ప్రభాస్.

ఇక తనకు వస్తున్న బాలీవుడ్ సినిమాల ఆఫర్ల గురించి మాట్లాడుతూ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రకోసం కేవలం 3 గంటలు బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడే అక్కడి వాతావరణం తనకు సూటవదని, తనకు అనిపించడంతో ఈ విషయాన్ని ఆరోజే ప్రభుదేవాకు చెప్పినా అతడి బలవంతంతో ఆ సినిమాలో చిన్న పాత్రను చేసానని అంటూ బాలీవుడ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ప్రబాస్.

తనకు వ్యక్తిగతంగా బాలీవుడ్ సినిమాలు చేయడంకన్నా తమిళ సినిమాలు చేయాలి అన్న కోరిక ఉందని తమిళ ప్రజలకు తన ‘బాహుబలి’ నచ్చితే తన సినిమాలు అటు తమిళంలో ఇటు తెలుగులో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని తనమనస్సులోని మాటలను షేర్ చేసుకున్నాడు ఈ డార్లింగ్..  



మరింత సమాచారం తెలుసుకోండి: