మెగా కుటుంబం నుండి వచ్చిన వరుణ్ తేజ్ అతడి కుటుంబ హీరోల పద్ధతికి భిన్నంగా తన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఇష్టమైన మసాలా సినిమాలను కాకుండా కొద్దిగా క్లాసిక్ టచ్ ఉన్న సినిమాలలో వరుణ్ తేజ్ నటిస్తూ ఉండటంతో హీరోగా ఇంకా సెటిల్ కాకుండానే వరుణ్ తేజ్ ఎందుకు ఈ ప్రయోగాలు తన పై తాను చేసుకుంటున్నాడు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

గత సంవత్సరం ‘ముకుంద’ గా వచ్చి తన గ్రీకు శిల్పం అవతారంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా మెగా అభిమానులు కోరుకునే మసాలాను అందివ్వలేక పోవడంతో పూర్తిగా మెగా అభిమానుల హీరోగా మారలేకపోయాడు. ఈ అనుభవం నుంచి పూర్తి పాఠాలు నేర్చుకోకుండానే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను ఒప్పుకుని ‘కంచె’ అంటూ వస్తున్నాడు. 

ఈసినిమా కోసం స్వాతంత్రం రాకముందునాటి జెమిందార్ ప్యాలెస్ లో హడావిడి చేసిన వరుణ్ తేజ్ ఆ తరువాత జార్జియా దేశానికి వెళ్ళి అక్కడ జరిగిన ఒక కీలక షెడ్యూల్ పాల్గొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంనాటి పరిస్తుతులను అప్పటి ప్రేమ కథను నేటి తరానికి చూపెట్టడానికి క్రిష్ చేస్తున్న ప్రయోగంలో వరుణ్ తేజ్ తన కెరియర్ ను పణంగా పెడుతున్నాడు. 
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదల చేసారు.

సముద్రతీరంలో దూరంగా కనిపిస్తున్న కంచెను సైనికులను చూస్తూ భుజం పై పెద్ద గన్ పెట్టుకుని నిలబడి ఉన్న వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ఒక అవార్డు సినిమాలా ఉంది. కానీ నేటి తరం యూత్ కు నచ్చేలా లేదు అంటూ అప్పుడే మెగా అభిమానులు తమలో తాము కామెంట్ చేసుకుంటున్నట్లు టాక్. ఈ కామెంట్స్ వరుణ్ తేజ్ వరకు వెళితే టెన్షన్ పడతాడేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: