రాజమౌళి తీసే సినిమాలు బ్లాకు బస్టర్ హిట్స్ అయినా ఆసినిమాలలో నటించిన హీరోలకు ఆసినిమాల స్థాయిలో పేరురాదు అనే అపవాదు ఉంది. అయితే గత కొద్దిరజులుగా ప్రభాస్ కు వస్తున్న ఊహించని గౌరవాలు చూస్తూ ఉంటే రాజమౌళి హీరోల సెంటిమెంట్ కు ప్రభాస్ బ్రేక్ వేశాడా అని అనిపిస్తోంది. 

దీనికి కారణం ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రభాస్ గురించి ఒక కథనాన్ని ప్రచురించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ పత్రిక ‘బాహుబలి’ కథకుడు  విజయేంద్ర ప్రసాద్ పై కూడ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనికి కొనసాగింపుగా ఈ పత్రిక తన లేటెస్ట్ సంచికలో ప్రభాస్ ను తన పాఠకులకు పరిచయం చేయడమే కాకుండా ప్రభాస్ పై భారీ స్థాయిలో ప్రశంసలు కురిపించింది. 

ప్రభాస్ ను ప్రఖ్యాత హాలీవుడ్ హీరోలు హారిసన్ ఫోర్డ్ ఎలిజా వుడ్ లతో పోలుస్తూ ఈపత్రిక వ్రాసిన కామెంట్స్ ఎవరినైనా ఆశ్చర్య పరుస్తాయి. ఈ పత్రిక వ్యాఖ్యలు చూసి రాజమౌళి కూడా ఈ పత్రిక కథనం పై స్పందించాడు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ తో ప్రభాస్ కు పోలిక పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ ట్విట్ చేసాడు. 

స్టార్ వార్స్, ఇండియానా జోన్స్ సిరీస్ సినిమాల హీరోగా హాలీవుడ్ ప్రేక్షకులలో ప్రముఖ స్థానాన్ని పొందిన హారిసన్ ఫోర్ట్ హాలీవుడ్ కలెక్షన్స్ ను తిరగ వ్రాసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇక ఎలిజా జోర్డన్ వుడ్ కూడా బాలనటుడిగా హాలీవుడ్ సినిమా రంగంలోకి ప్రవేసించి ఇప్పటికే ఎన్నో ప్రముఖ మైన బ్లాక్ బస్టర్ హాలీవుడ్ హిట్ మూవీలలో నటించి మెప్పించాడు. ఈ ఇద్దరి టాప్ హీరోలతో ప్రభాస్ ను పోలుస్తూ ఫోర్బ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించిన మరునాడే ప్రభాస్ భారత ప్రధానమంత్రి మోడీని కలవడమే కాకుండా ఆయన అభినందనలు పొందడంతో మాటలకందని జోష్ లో ప్రభాస్ రోజులు గడుపుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: