కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ చిరకాల స్నేహితులు. ఒక్క స్నేహితులు అని చెబితే సరిపోదు. అంతకు మించి వీరిద్దరి మధ్య పెనవేసుకొని ఉంది. అయితే తాజాగా రజనీకాంత్..కమల్ హాసన్ కి మొట్టికాయలు వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ భారీ అంచనాలతో రిలీజ్ అయింది.

అయితే ఆ మూవీని విడుదల చేయటానికి సైతం కమల్ హాసన్ చాల ప్రయత్నాలే చేశాడు. మొత్తానికి భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఆ మూవీ, రిలీజ్ అనంతరం అంతే భారీగా నష్టాన్ని చవిచూసింది. ఈ సినిమాకి తిరుపతి బ్రదర్స్ సహనిర్మాతలు కావడంతో వారు భారీగా నష్టపోయారు. ఈ నష్టాన్ని కొంతమేరకు పూడ్చే క్రమంలో కమల్ తన తదుపరి చిత్ర పంపిణీ హక్కులను తిరుపతి బ్రదర్స్ కిఇచ్చాడు. అంతే కాకుండా కొంత ఉత్తమవిలన్ కి నటించినందుకు తీసుకున్న పారితోషికాన్ని సైతం కొంత మేర తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే, సహ నిర్మాతలుగా ఉన్న తిరుపతి బ్రదర్స్, కమల్ హాసన్ ఎదుట తప్పుడు లెక్కలు చూపించారనే ఆరోపణ కూడ ఉంది. కాని ఇవేమి పట్టించుకోకుండా కమల్ హాసన్ వారిని ఆదుకోవటం పై రజనీకాంత్ రంగంలోకి దిగాడు. కమల్ హాసన్ కి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది.

ఏది నిజమో..ఏది అబద్ధమో చూసి తెలుసుకోవాలి.. నిర్మాతలు చెప్పిన దాంట్లో కొంత మేర మాత్రం నిజం..మిగతాది అబద్ధం అని చెప్పి..కమల్ హాసన్ కి మొట్టికాయలు వేసినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. విశ్వరూపం మూవీ విడుదల  సమయంలోనూ కమల్ హాసన్ కి ఇదే విధంగా రజనీకాంత్ క్లాస్ పీకాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: