బాహుబలి మూవీలో అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్న మూవీ కాలకేయుడి పాత్ర. నిజానికి బాహుబలి మూవీలో కాలకేయుడి పాత్రకి అంత ప్రాముఖ్యత వస్తుందని రిలీజ్ వరకూ ఎవ్వరూ ఊహించలేదు. కాని, కాలకేయుడు మాట్లాడిన కిలికిలి భాష మాత్రం అందరీని కొత్త అనుభూతికి తీసుకువెళుతుందనేది బాహుబలి చిత్ర యూనిట్ ఊహించిన విషయం.

కాని రిలీజ్ అనంతరం ప్రభాస్, రానా లకి మూవీలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో...కాలకేయుడు విరోచిత పొరాటం కూడ బాహుబలి సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. కాని, బాహుబలి మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ లో కాలకేయ పాత్ర ధరించిన ప్రభాకర్ ని మీడియాకి దూరం పెట్టేశాడు రాజమౌళి. కాలకేయుడితో మీడియా ఎప్పుడు మాట్లాడదామన్నా... అతడు మాత్రం బాహుబలి చిత్ర పబ్లిసిటి యూనిట్ లో ఎక్కడూ కనిపించడు. దీంతో రాజమౌళి కావాలనే, కాలకేయుడిని పక్కన పెట్టేశాడనే క్లియర్ టాక్స్ అందరిలోనూ వినిపించాయి.

అయితే, ఇప్పుడు అందరి అంచనాలకు భిన్నంగా రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడు. బాహుబలి మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కాలకేయుడిని, రెండవ భాగంలో కొంత వరకూ ఉపయోగించుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడం. అయితే కేవలం 5 నిముషాల నిడివిని బాహుబలి2 లో కాలకేయునికి కేటాయించాడంట.

ఆ 5 నిముషాలు కాలకేయుడు చేసే భీభత్సం అందరిని గగుర్భాటుకి గురిచేస్తుందని చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా రాజమౌళి, కాలకేయుడికి మరో ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ బాహుబలి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ విషయం తెలుసుకున్న కాలకేయ పాత్రధారి ప్రభాకర్, తెగ సంతోష పడుతున్నాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: