తెలగు చిత్రసీమలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో నిర్మించిన చిత్రం బాహుబలి ఎన్నో అంచనాల  మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటి రికార్డు స్థాపించింది. రాజమౌళి దర్శకత్వంలో తాజాగా విడుదలైన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా రికార్డులని తిరగరాస్తూ , బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.   ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి సరికొత్త రికార్డ్స్ కి తెరలేపింది. ఇప్పటి వరకూ ఎవ్వరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ తో బాహుబలి బాక్సాపీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచంలో తెలుగు వాడి సత్తా చాటిన చిత్రంగా ఈ సినిమా అందరి ప్రశంసలు పొందింది. 


బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా

జూలై 10న రిలీజ్ అయిన బాహుబలి మొత్తం 16రోజుల్లోనే 400 కోట్ల మైలు రాయిని దాటింది .అన్ని భాషలతో కలుపుకొని బాహుబలి సినిమా 10 రోజుల్లో గ్రాస్ 350 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఒక రీజనల్ ఫిల్మ్ అయిన బాహుబలి, ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ తెలుగు సినిమా కనీసం వంద కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేయటమే కష్టంగా ఉన్న సమయంలో, బాహుబలి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయటం అన్ని చోట్ల నుండి హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం బాహుబలి సినిమా ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని గ్రాస్ 55 కోట్లు కలెక్ట్ చేసింది.


అలాగే ఇండియా వ్యాప్తంగా నాలుగు భాషలైన తెలుగు, తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో కలుపుకొని గ్రాస్ 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుంటే 10 రోజుల్లో 355 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. బాలీవుడ్ చిత్రాల రికార్డు ని కూడా బద్దలు కొట్టి షారుఖ్ ,అమీర్ ఖాన్ ల రికార్డులను చెరిపేసింది బాహుబలి. 742కోట్లతో అమీర్ ఖాన్ పీకే మొదటి స్థానంలో ఉండగా 542కోట్లతో ధూమ్ 3 రెండవ స్థానంలో ,432కోట్లతో చెన్నై ఎక్స్ ప్రెస్ మూడో స్థానంలో నిలిచాయి కాగా నాల్గవ స్థానంలో 416కోట్లతో బాహుబలి నిలిచింది . రాబోయే రోజుల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ ని బీట్ చేసి మూడో స్థానంలో నిలవనుంది బాహుబలి.





మరింత సమాచారం తెలుసుకోండి: