తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ గా వెలుగొందిన హీరో కృష్ణ.. ఆయన వారసత్వంగా తెలుగు తెరకు చిన్న తనంలోనే పరిచయం అయిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు. చిన్న తనంలోనే తన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్న హీరో ‘రాజమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తర్వాత హీరోగా మంచి పేరు సంపాదించింది మాత్రం కృష్ణ వంశి దర్శకత్వంలో ‘మురారి’ ఈ చిత్రంతో మహేష్ పరిపూర్ణ నటన కనబర్చాడు.

తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు లాంటి సినిమాలతో మాంచి హిట్లు సాధించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మంచి హైట్ దానికి తగ్గ అందం క్యూట్ స్మైల్ తో ఇట్టే ఆకర్శించే పర్సనాలిటీ ఉన్న  హీరో మహేష్ బాబు. ఈయన  నటించిన శ్రీమంతుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి మంచి ఆధరణ లభించింది. అయితే మహేష్ బుబు త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ తను చిన్నప్పటి నుంచి మద్రాస్ లో పెరగడం వల్ల తమిళ భాషపైమంచి పట్టు ఉందని అయితే ఆ భాషలో నటించడానికి తనకు అభ్యంతరం ఉండదు కానీ బాలీవుడ్ లోకి మాత్రం ఎంట్రీ అనేది జరగని పని అని తనపై వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు.

శ్రీమంతుడు పోస్టర్

Latest Wallpapers of Srimanthudu

ఇక తాను దర్శకత్వం వహించ బోతున్నట్లు కూడా కథనాలు వచ్చాయని వాస్తవానికి దర్శకత్వం అంటే అస్సలు నచ్చదని దానిక జోలికి కూడా వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తాజాగా మహేష్ నటిస్తున్న శ్రీమంతుడు చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్న సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పై విషయాలను చెప్పాడు. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగడం అనేది తన భార్య నమ్రత ప్రోత్సాహమని అంతే కాదు ఆ విషయాలు కూడా తనే చూసుకుంటుందని కాబట్టే  నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. ఇక ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తైతే శ్రీమంతుడు చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నారు. మానవతా విలువలు చాటి చెప్పే సినిమా అని మనసుకు హత్తుకునే సినిమా అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: