సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి పుట్టిన రోజు కానుకగా ‘బ్రహ్మోత్సవం’ లోగో లాంచ్ చేయించాడు. అయితే ఈ సినిమా ‘శ్రీమంతుడు’షూటింగ్ అయిపోగానే మొదలు కావాల్సి ఉంది. ఇక ఆరోజు చేసిన అనౌన్స్ ప్రకారం జులై 10 న చిత్ర షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది.. కానీ అలా జరగలేదు. ఇకపోతే ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు మహేష్, చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. ఇక బ్రహ్మోత్సవం విషయానికి వస్తే జులై 10నే మొద‌లవ్వాల్సిన బ్ర‌హ్మోత్స‌వం ఇంకా మొద‌లుకాలేదు.

మే 31న కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్సవంకు ముహూర్తం పెట్టాడు మ‌హేశ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ముగ్గురు అందమైన భామలు కాజల్, సమంత, ప్రణీత లు నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇక పోతే ఈ సినిమా కథ విషయమో...? లేదంటే ఇతరత్రా కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ సినిమా మాత్రం పట్టాలపైకి రాలేదు. అయితే మహేష్ ఫ్యాన్స్ మటుకు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

శ్రీమంతుడు లో ఓ దృశ్యం


తమ అభిమాన నటుడు వెంట వెంటనే సినిమాలు అంటే అందరికీ ఆనందమే కదా..! కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకపోవడంతో కొంత నిరుత్సాహం కలింగించింది మహేష్ ఫ్యాన్స్ కి. ఇక శ్రీ‌మంతుడులో క్లాస్ గా మాస్ రోల్ లో దుమ్ము లేప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు సూప‌ర్ స్టార్. మహేష్ తర్వాత సినిమా పూరీ, త్రివిక్ర‌మ్, వినాయ‌క్ ల‌లో ఎవ‌రో ఒక‌రితో సినిమా చేయాలని చూస్తున్నాడు మ‌హేశ్.


మరింత సమాచారం తెలుసుకోండి: