తెలుగు ఇండస్ట్రీలో అందాల భామ శ్రియా శరన్ గత కొంత కాలంగా తెలుగు తెరపై కనిపించడం లేదు. ఆ మద్య వచ్చిన మనం సినిమాలో తళుక్కున మెరిసిన ఈ అమ్మడు హిందీ దృశ్యం లో అజయ్ దేవగన్ సరసన నటించింది. తెలుగు ఇండస్ట్రీలో మంచి గ్లామర్ పాత్రలు పోషించిన ఈ అమ్మడు క్లాసికల్ డ్యాన్సర్. గత కొంతకాలంగా ఏ సినిమాలు లేక అడపా దడపా కనిపిస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తు అలరించింది.

శ్రియా శరన్ ఆ మద్య ఓ నటుడితో లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ నేను ఇప్పటి వరకు మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో  చాలా మంది హీరోలతో నటించాను. అగ్ర హీరోలతో నటించాను కానీ ఏ ఒక్కరి ప్రేమలో పడలేదు.. ఇప్పుడు నేను కెరీర్ పైనే దృష్టి సారిస్తున్నాను. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ స్టార్‌లతో కలిసి పనిచేశాను కానీ ఏ ఒక్కరితోనూ ప్రేమలో పడలేదు.

హీరోయిన్ శ్రియా శరన్


ఇండస్ట్రీ అన్న తర్వాత ఇలాంటి రూమర్లు రావడం సహజమే అందుకే అవినేను పట్టించుకోను. అంతే కాదు నా స్నేహితులు చాలా మంది వివాహం గురించి అడుగుతుంటారు సమయం వస్తే ఏదీ ఆగదు కదా..!  అందరు అమ్మాయిల్లాంటి దాన్నే నేను కూడా నాకు రాబోయే వరుడికి కొన్ని అర్హతలు ఉండాలని కోరుకుంటా. నా వ్యక్తిత్వాన్ని గౌరవించి, మానసికంగా,ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవాడై వుండాలి. అలాంటి వ్యక్తి తారసపడితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది



మరింత సమాచారం తెలుసుకోండి: