తెలుగు ఇండస్ట్రీ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తీసిని చిత్రం ‘బాహుబలి’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్లను నటింప చేయలేదు..జీవించేలా చేశాడు.. అందుకే అంద గొప్ప విజయం సాధించాడు రాజమౌళి. ఇక  తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమాకు రికార్డులు ఈ సినిమా సొంతం చేసుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు జక్కన్న చిత్ర కథ పూర్తిగా కావాలంటే రెండు భాగాలు గా ఉంటేనే రక్తి కడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే బాహుబలి ది బిగినింగ్ లో చివరి సన్నివేశంలో వీరేంద్ర బాహుబలిని కట్టప్ప తో నేనే చంపాను.. అంతే కాదు కత్తితో బాహుబలిని వెన్నుపోటు పొడుస్తున్నట్లు చూపించారు.

ఇక ఇక్కడ మొదలైంది సగటు  ప్రేక్షకునికి ఆలోచనలు..  ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తోంది. తాజాగా ఆ చిత్రం రచయిత విజియేంద్ర ప్రసాద్..ఇచ్చిన టీవి ఇంటర్వూలో ఇంకో కొత్త ఊహను అభిమానుల్లోకి వదిలారు. విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ... "మీరు అసలు కట్టప్ప..బాహుబలిని చంపారని ఎందుకు అనుకుంటున్నారు ? అతన్ని కేవలం పొడిచాడు అంతే." ఈ మాట విన్నప్పటి నుంచి ప్రేక్షకులకు భిన్న మైన ఆలోచనలు మొదలు అయ్యాయి.  ఈ చిత్ర కథనాలు వింటున్న సమాచారం మేరకు  రమ్యకృష్ణ సూచన మేరకు...బాహుబలిని కట్టప్ప చంపేస్తాడని తెలుస్తోంది. 


 బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్

ఈ మద్య కొన్ని కథనాల ప్రకారం దేవసేన ఒక రాజకుమారి అని ఆమెను భళ్లాలదేవ, బాహుబలి ఇద్దరు ఇష్టపడతారని కానీ బాహుబలినే దేవసేన వరిస్తుంది. ఇది జీర్ణించుకోలే పోతాడు భళ్లాల... కానీ దేవసేనతో వివాహం మహిష్మతి రాజ్య రాజమాతకు ఇష్టం లేకపోవడంతో బాహుబలి ఆమెను ఎదిరించి వివాహం చేసుకొని రాజ్యం వదిలి పోతాడని కథనం.. అయితే ఈ చిత్రంలో బహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి.వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది. బాహుబలి సినిమా చివర్లో ‘బాహుబలి'ని నేనే చంపానని కట్టప్ప చెప్పటమే దీనికి కీలకం అయ్యింది. ఇక బాహుబలి 2 లో సినిమా ఎన్ని మలుపులు తిరగనుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: