ప్రస్తుతం లండన్ లో రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేస్తున్న జూనియర్ తమన్నా కిక్ గురించి చాల సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ప్రస్తుతం లండన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలో తమన్నా కిక్ ను కూడ జోడించాలి అన్న ఆలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమధ్యేనే షూటింగ్‌ ప్రారంభమైన ఈసినిమా షెడ్యూల్ అనుకున్న దానికన్నా చాల వేగంగా జరుగుతోంది అని తెలుస్తోంది. సుకుమార్‌ శైలికి భిన్నంగా ఈసినిమా షూటింగ్ ను సుకమార్ చాలవేగంగా పరిగెత్తిస్తున్నాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈసినిమాని ఎట్టి పరిస్తుతులలోను రాబోతున్న సంక్రాంతికి విడుదల చేయాలని జూనియర్ పట్టుదలతో ఉండటంతో సుకుమార్ ఈవేగాన్ని ప్రదర్శిస్తున్నాడు అని టాక్.

ఈవార్తలు ఇలా ఉండగా ఈసినిమాలో ఒక భారీ ఐటమ్ సాంగ్ గురించి అప్పుడే కసరత్తులు ప్రారంభం అయ్యాయి అని అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ను షేక్ చేసిన ‘రింగ రింగా’, ‘అ అంటే అమలాపురం’ సాంగ్స్‌ని మించిపోయే రేంజ్ లో ఈ ఐటెమ్‌ సాంగ్‌ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. గతంలో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘100% లవ్’ సినిమాలో నటించిన తమన్నాతో సుకుమార్ కు ఉన్న సాన్నిహిత్యంతో తమన్నాను ఈ విషయం పై ఒప్పించినట్లు తెలుస్తోంది.

దీనికోసం ఒక మంచి కిక్ ఉండే ఐటమ్ సాంగ్ ను దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ట్యూన్ చేసాడు అని టాక్. ఈసినిమాలో ఇంటర్ పోల్ పోలీసుగా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్న జూనియర్ పాత్రకు అభిరామ్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం జూనియర్ కొడుకు బుడ్డోడి పేరు కూడా అభిరామ్ కావడంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: