అయినా సమంతా సీనియర్‌ హీరోయిన్‌ కదా. ఆమెకు తనకంటె జూనియర్‌ అయిన నిత్యామీనన్‌ను ఇమిటేట్‌ చేయాల్సిన ఖర్మ ఏంటి? అనే సందేహం సమంతాభిమానులకు రావడం సహజం. కానీ.. ఇది ఆమె తన ఇష్టానుసారం చేస్తున్న ఇమిటేషన్‌ కాకపోవచ్చు... కానీ సినిమాకు సైన్‌ చేసిన తర్వాత.. దర్శకుడే అలాంటి ఇమిటేషన్‌ పనిచెబితే చేయక తప్పదు కదా! అవును మరి.. సమంత ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉంది. ఇక ఆ సినిమా చేసినంత కాలమూ.. డీవీడీలు వేసుకుని నిత్యామీనన్‌ నటించిన తీరు చూసుకుని.. కెమెరా ముందు దాని కాపీలా నటిస్తూ పోవడమే! 


దక్షిణాది చిత్రాల్లో బిజీగా ఉన్న సమంత.. తమిళంలో ఓ రీమేక్‌ చిత్రానికి తాజాగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మళయాళంలో కొంత కాలం కిందట సూపర్‌ హిట్‌ అయిన బెంగుళూరు డేస్‌ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఈచిత్రం తమిళ రీమేక్‌ వస్తుందని ప్రచారం జరిగిన తొలిరోజుల్లోనే అందులో సమంత నటిస్తుందని కూడా అన్నారు. అయితే తాను పెళ్లి చేసుకోవాలనుకున్న సిద్ధార్థతో బ్రేకప్‌ అయిన తర్వాత.. అతను ఆచిత్రంలో ఉండడంతో.. తాను చేయబోవడం లేదని.. సమంత పక్కకు తప్పుకుంది. కానీ ఇన్నాళ్లకు మళ్లీ అందులో నటించడానికి ఒప్పుకున్నదిట. 


బెంగుళూరు డేస్‌ తమిళ రీమేక్‌లో ఆర్య, శ్రీదివ్య, దగ్గుబాటి రాణా, బాబీ సింహా, లక్ష్మీరాయ్‌ తదితరులు ఉన్నారు. వీరితో కలిసి సమంత కూడా నటించబోతోంది. మళయాళం ఒరిజినల్‌ వెర్షన్‌లో నిత్యామీనన్‌ పోషించిన పాత్రను తమిళంలో సమంతా చేయాల్సి ఉంటుందిట. ఇక ఏముందీ.. రీమేక్‌ అనగానే.. సెట్‌లో డీవీడీ ప్లేయర్‌ పెట్టుకు కూర్చోవడం మన వారికి అలవాటే! ఇక మళయాళ సీడీ చూసుకుంటూ నిత్యామీనన్‌ ఎలా చేసిందో .. మూడ్స్‌ ఎలా పలికించిందో అబ్జర్వ్‌ చేస్తూ.. ఆమెను అనుకరిస్తూ సమంత చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ.. మళయాళంలో ఈ చిన్నచిత్రం విజయంసాధించేసరికి.... తమిళంలో క్యాస్టింగ్‌ పరంగానే పెద్దచిత్రంగా మారిపోయింది. సమంతా తమ చిత్రంలో నటిస్తున్న మాట నిజమేనని, ఆమె పార్ట్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అవుతుందని యూనిట్‌ వారు కూడా ప్రకటించారు. మొత్తానికి ప్రేక్షకులు నిత్యామీనన్‌ పెర్ఫార్మెన్స్‌తో సమంతను పోల్చిచూడకుండా ఉంటే అంతే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: