త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ నటించే ఛాన్స్ వస్తే, ఏ హీరో మాత్రం ఆ ఆఫర్ ని వదులుకుంటాడు చెప్పండి. అందుకే, అందివచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకుండా..వెంటనే త్రివిక్రమ్ మూవీకి ఓకే చేశాడు నితిన్. ఇదంతా జరిగి దాదాపు 4 నెలలు అయింది. పెద్ద హీరోల కాల్షీట్స్ ఇప్పట్లో త్రివిక్రమ్ కి దొరికేటట్టు కనిపించకపోవటంతో, త్రివిక్రమ్ మరోసారి తన టాలెంట్ న తనే పరీక్షించుకోబోతున్నాడు.

ఇప్పటి వరకూ పెద్ద హీరోలతో ఎక్కువుగా పని చేసి, సక్సెస్ లను చూసిన త్రివిక్రమ్, ఇప్పుడు ఓ రేంజ్ హీరోతో సినిమా తీసి గ్రాండ్ సక్సెస్ ని సాధించాలనే కసితో ఉన్నాడంట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా రానుంది.

ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సమంతాని హీరోయిన్ గా ఎంపిక చేశారట. సన్నాఫ్ సత్యమూర్తి చితాన్ని నిర్మించిన రాధా కృష్ణ ఈ చిత్రాన్ని కూడా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో వున్నారు. 

వేసవిలో త్రివిక్రమ్ ల పంచ్ లు పేలిపోవడం ఖాయం అని చిత్ర యూనిట్ లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా చాలా కాలం తరువాత త్రివిక్రమ్ లో సర్దుకుపోయే తత్వాన్ని చూస్తున్నామని ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: