ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని ప్రభంజనాన్ని అందుకుంటున్న మూవీ బాహుబలి. బాహుబలి మూవీ రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. దీంతో ఇండియన్ బాక్సాపీస్ వద్ద బాహుబలి సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పింది.

అయితే తాజాగా బాహుబలి మూవీ హిందీలో సత్తా చాటుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు,తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా నాలుగో వారంలోకి ప్రవేశించింది.హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, బాహుబలి మాత్రం తన సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. 

ఇక హిందీలోని డబ్బింగ్ సినిమాల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే, హిందీలోకి డబ్బింగ్ అయిన్న అన్ని రీజినల్ ఫిల్మ్స్ కలెక్షన్స్ కంటే బాహుబలి కలెక్షన్స్ ఎక్కువుగా ఉన్నాయి. నిజానికి బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలకు అంతంతమాత్రమే ఆదరణ ఉంటుంది. కాని బాహుబలి ఇప్పటి వరకూ, 95.76 కోట్ల రూపాయాలు వసూలు చేసింది.

ఇక సల్మాన్ ఖాన్ సినిమా‘భజరంగీ భైజాన్’ ఓ పక్క కలెక్షన్ల వర్షం కురిపిస్తూ  హిందీ సినిమా రికార్డులను తిరగరాస్తున్నా, మరోపక్క ‘బాహుబలి’ కూడా స్ట్రాంగ్‌గా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. హిందిలో డబ్బింగ్ చిత్రాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా బాహుబలి ఘనమైన రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ వారాంతం కల్లా బాహుబలి 100 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచన.

మరింత సమాచారం తెలుసుకోండి: