పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో నటించాలన్నా, తన పేరుని పబ్లిసిటి కోసం వాడుకోవాలన్నా లేదా తన పేరుని ఎక్కడ పడితే అక్కడ అందరికి చెప్పుకోవాలన్నా...అందుకు ఓ స్టేటస్ ఉండాలి. ఆ స్టేటస్ ఉన్న అప్ కమింగ్ మెగా యాక్టర్ సాయిధరమ్ తేజ్. అవుతు సాయి ధరమ్ తేజ్ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పిండేయాలని చూస్తున్న ఈ యంగ్ హీరో.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న నూతన చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్ సరసన లారిస్సా బోనేసి కథానాయికగా నటిస్తోంది.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...‘‘ఇందులో నా పేరు ఆదిత్య. ఈ చిత్రంలో నేను ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే పాత్రలో నటిస్తాను. హీరోయిన్‌తో ప్రేమలో పడిన తర్వాత కొన్ని కారణాలతో వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో హీరోకి తిక్కరేగుతుంది. అందుకే ఈ సినిమాకి‘తిక్క’ అనే టైటిల్‌‌ను పెట్టారు. చివరికి హీరో హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేదే సినిమా కథ’’ అన్నారు.

అయితే మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాల్లోకి వెళేతే, తిక్కఅనే మూవీలో సాయిధరమ్ తేజ్ పవన్ కి అభిమానిగా కనిపిస్తాడంట. అంతే కాకుండా మూవీలో గబ్బర్ సింగ్ కి సంబంధించిన డైలాగ్ లు, అలాగే పవన్ కళ్యాన్ కి సంబంధించిన  స్టైల్ ని సాయిధరమ్ తేజ్ తెగ వాడతాడంట. పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకూ ఎవ్వరూ వాడని విధంగా సాయిధరమ్ వాడబోతున్నాడనే టాక్స్ ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: