పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్’ సినిమాలో గెడ్డం లేకుండా పవన్ ఎలా కనిపిస్తాడు అన్న పవన్ అభిమానుల ఆత్రుతకు దర్శకుడు బాబి తెర దించాడు. గుబురు గెడ్డంతో యోగిలా మారిపోయిన పవన్ అవతారాన్ని చూసి భయపడిన పవన్ అభిమానులకు పండుగ చేసుకునే విధంగా పవర్ స్టార్ లుక్ లో పవన్ మళ్ళీ చూపెడుతూ ‘సర్దార్’ షూటింగ్ స్పాట్ లోని ఫోటోలను బయటకు వదిలాడు డైరెక్టర్ బాబి. 

దీనితో క్లీన్ గా షేవ్ చేసుకుని ఒకనాటి టాలీవుడ్ ఎంపరర్ తిరిగి తమ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానులకు ఈరోజు పండుగలా మారింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ నటించే యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఈ యాక్షన్ సీన్స్ లో చాల ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఈ ఫైటింగ్ సీన్స్ కు సంబంధించిన ఫైట్స్ ను పవన్ స్వయంగా కంపోజ్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి.

గతంలో పవన్ నటించిన కొన్ని సినిమాలకు తానే స్వయంగా ఫైట్స్ కంపోజ్ చేసుకున్న పవన్ తిరిగి ఆ ప్రయోగాన్ని తన ‘సర్దార్’ లో చేస్తున్నట్లుగా అర్ధం అవుతోంది. అయితే నిన్న ఈసినిమా నిర్మాత శరత్ మరార్ ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పవన్ లుక్ అంటూ పోస్ట్ చేసాడు. 

దీనితో ఈ సినిమా అసలు పేరు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా మారుతుందా లేదంటే పవన్ అభిమానులకు క్లారిటీ వచ్చే విధంగా ఇలా పోస్ట్ చేసాడా అనే విషయం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పవన్ నిజంగానే మనసు పెట్టి ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తే రాబోతున్న సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడం పెద్ద కష్టం ఏమి కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: