వివాదాలకు అనునిత్యం రెడీగా ఉండే రామ్ గోపాల్ వర్మ వచ్చే వారం విడుదల కాబోతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ పై పెట్టిన ట్విట్ మహేష్ అభిమానులను టార్చర్ పెడుతోంది అన్న వార్తలు వినపడుతున్నాయి. ఒకవైపు ‘శ్రీమంతుడు’ గా మహేష్ లుక్ అద్భుతం అని అంటూ వెనుక నుంచి చురకలు అంటించాడు వర్మ. ‘ఇప్పుడే నైజాం డిస్ట్రిబ్యూటర్లను కలిసాను. బాహుబలితో సంబంధం లేకుండా శ్రీమంతుడు మంచి బిజినెస్ ఎలా చేస్తుందని వారు అంటున్నారు. అంతేకాదు ‘శ్రీమంతుడు’  రిలీజైన తర్వాత కూడా ‘బాహుబలి’ బిజినెస్ పెరుగుతుందని వారు అంటున్నారు. అయితే వారి మాటలలో అర్ధం నాకు బోధపడలేదు’ అంటూ ట్విట్ చేసి మహేష్ అభిమానులను గందరగోళంలో పడేసాడు వర్మ. 

వర్మ కామెంట్స్ ను బట్టి చూస్తూ ఉంటే ‘శ్రీమంతుడు’ ఊహించినంత హిట్ కాదని ముందుగానే వర్మ సంకేతాలు ఇస్తున్నాడా అంటూ మహేష్ అభిమానులు వర్మ ట్విట్ పై తీవ్ర గందరగోలలో ఉన్నట్లు టాక్. వర్మ ట్విట్ ఎలా ఉన్నా ‘శ్రీమంతుడు’ బిజినెస్ 80 కోట్లు క్రాస్ చేయడం ఫిలింనగర్ లో షాకింగ్ న్యూస్ గా మారింది. వరసగా రెండు పరాజయాలు వచ్చిన తరువాత కూడ మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ కు ఈ రేంజ్ లో బిజినెస్ అవ్వడం ప్రిన్స్ స్టామినాను సూచిస్తోంది అని అంటున్నారు. 

ఈవార్తలు ఇలా ఉండగా శ్రీమంతుడు ఆడియో వేదిక మీద మహేష్ ఈ సినిమా భాద్యత మీదే అని అన్నందుకు మహేష్ అభిమానులు ప్రిన్స్ మాటలను చాల సీరియస్ గా తీసుకుని వారి స్థాయిలో కూడ ‘శ్రీమంతుడు’ ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమై పోతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. 

శ్రీమంతుడు ఇమేజ్ తో కూడిన టి.షర్టులు వేసుకుని మహేష్ అభిమానులు మన ఇరు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో తమ మోటార్ బైక్స్ పై తిరిగితు ఈసినిమాను జనంలోకి తీసుకు వెళ్ళడానికి తమ శాయశక్తులా తమవంతు ప్రయత్నాలు  చేస్తున్నారు. ఇంతకీ వర్మ ఈ ట్విట్ మిసైల్ ఎందుకు పెల్చాడో సమాధానం లేని ప్రశ్నగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: